పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం ఆంధ్రప్రదేశ్ లోకి విచ్చలవిడిగా అక్రమ రవాణా అవుతోంది. ఎన్ని కేసులు నమోదు అవుతున్నా.. ఎందరిని అరెస్టు చేస్తున్నా ఈ అక్రమ లిక్కర్ దందా ఆగడం లేదు.
తాజాగా కర్నాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముఠాను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నాటక నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొచ్చి ఓ ముఠా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి పక్కా సమాచారంతో పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ తరుణంలో కర్ణాటక నుంచి కారులో మద్యం తీసుకున్న ముఠాను వలపన్ని పట్టుకున్నారు.
ఇందులో వారి వద్దనుంచి 5లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు, కారు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ సుధాకర్ తెలిపారు.
మరికొంత మంది పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని ఆయన తెలిపారు
.