లోక్సభలో ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే బడ్జెట్ విధానాలను ప్రకటించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిరుత్సాహ పరిచే విద్రోహ బడ్జెట్ గా ఉందని, సిపిఐ, సిపిఎం నాయకులు బడ్జెట్ కాపీలు తగలబెట్టారు.
కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ,పది గంటలకి అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎ. రామానాయుడు, సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య ప్రజలను, కార్మికులను, వ్యవసాయ కూలీలను, రైతాంగాన్ని, నిరుద్యోగులను నిరుత్సాహ పరచి ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూరేలా బడ్జెట్ ప్రవేశ పెట్టారని వాపోయారు.
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు పూర్తిగా అన్యాయం జరిగిందని ఇప్పటికే ప్రత్యేక హోదా ఇవ్వకుండా విభజన హామీలు అమలు జరపకుండా ద్రోహం చేసిన బిజెపి ఈ బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధిని కూడా దెబ్బ కొట్టిందని తెలిపారు.
పార్లమెంటులో ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ ఊసే లేదని, రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి పైసా కూడా ఇవ్వలేదని, కడప ఉక్కు ఫ్యాక్టరీ, రాయపట్నం ఎటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు 10 సంవత్సరాలైనా నిధులు పెంచక, నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.
ఈ బడ్జెట్ నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ కు విద్రోహ బడ్జెట్ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ద్రోహం పట్ల అన్ని రాజకీయ పార్టీలు పిడికిలి బిగించి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు కొనసాగించాలని అని పిలుపునిచ్చారు.
సమర్థవంతంగా నడుస్తున్న ఎల్ఐసి పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో విచ్ఛిన్నం చేస్తుందని వాపోయారు. గ్రామీణ రైతాంగానికి , పట్టణ కార్మిక వర్గానికి, మధ్యతరగతి వేతన జీవులకు ఈ బడ్జెట్ ఏ విధంగానూ ప్రస్తుత సంక్షోభం నుండి ఊరట కల్పించ లేకపోయిందని తెలిపారు.
మద్దతు ధర చట్టం గురించి ప్రస్తావించలేదని ,రైతులకు ఇచ్చిన హామీలను స్పందించి రైతాంగ ఉద్యమానికి ద్రోహం చేసిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు పెంచాలని పోయి తగ్గించడం ఘోరమని వాపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ ఎన్నికల ఆర్భాటం చేసినా ఈ బడ్జెట్లో రాబోయే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే కల్పించనున్నట్లు ప్రకటించారని అవి కూడా వస్తాయన్న నమ్మకం లేదన్నారు.
ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం బడ్జెట్ కాపీలను తగల పెట్టడం జరిగింది .
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, టి జనార్ధన్, పి మురళి,జె. రామచంద్రయ్య, నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్, మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జై లక్ష్మి, కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి ,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంజుల, నదియా,, రత్నమ్మ, కే వై రాజా, ఎన్ శివ, ఎండి రవి, శ్రీ రాములు, మారెళ్ళ శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, పద్మనాభరెడ్డి, రామచంద్రయ్య, నాగరాజు, ఏపీ బాల, ఎల్ కె నాయుడు, సురేష్, కుమార్, ప్రమీలా ,విజయ, పూర్ణ, నాగభూషణం, ముద్దు కృష్ణ సిపిఎం నాయకులు సిపిఎం నగర కార్యదర్శిటీ. సుబ్రహ్మణ్యం, కే వేణు, ఏ రాధాకృష్ణ, జీవి రమణ, బి గజేంద్ర, ఆర్ మల్లికార్జున రావు ,అక్బర్, రవి ,ఈ సుజాత తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post