ప్రభాస్ హీరోగా చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’ ప్రిరిలీజ్ ఫంక్షన్ లో విషాదం చోటు చేసుకుంది. వేడుక చూడడానికి వచ్చిన ప్రభాస్ అభిమాని గాయపడ్డారు. అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
హైదరాబాదు సమీపం హయత్ నగర్ లోని రామోజీ ఫిలింసిటీలో రాదే శ్యాం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా అట్టహాసంగా ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి చాలా పెద్ద సంఖ్యలో ప్రభాస్ అభిమానులు రావడంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన కృష్ణంరాజు కటౌట్ పైకి అభిమానులు. భారీ సంఖ్యలో ఎక్కారు. లెక్కకు మిక్కలిగా అభిమానులు ఎక్కడంతో ఆ కటౌట్ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది.
కటౌట్ కింద పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఈ ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్.. అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా కావడంతో.. చాలా పెద్దసంఖ్యలో అందరూ తరలివచ్చారు.
ఫ్యాన్స్ ను అదుపు చేయడం నిర్వాహకులకు చాలా కష్టమైంది. ఒక దశలో అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసుల లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కటౌట్ కూలిపోయి.. ఒక అభిమాని ప్రాణాపాయ స్థితిలో ఉండడం అందరినీ కలవరపెడుతోంది.
.