ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ ను పూర్తిగా మారుస్తున్నారు. అయితే మాజీలు అవుతున్న కీలక నాయకుల స్పందన గురించి ఆయనలో భయాలు రేకెత్తుతున్నాయా?
జగన్ మంత్రివర్గం మార్పు అనేది రాజకీయాల్లో చాలా కీలకంగా కనిపిస్తోంది. పార్టీలో కీలక నాయకులనే జగన్ తాను సీఎం కాగానే మంత్రి వర్గంలోకి తీసుకున్నారు.
అందరూ ఘనాపాటీలే! వాళ్లలో చాలా వరకు ఇప్పుడు మాజీలు అవుతున్నారు. వాళ్లు పార్టీకి చేటు చేసే అవకాశం ఉందా? అలాంటి భయం ముఖ్యమంత్రిలో ఉందా? కేబినెట్ సమావేశంలో జరిగిన పరిణామాలను గమనించిన ప్రజల్లో ఇలాంటి అనుమానం కలుగుతోంది.
.