చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యుడు అక్కడే పని చేసే మహిళా సూపర్ వైజర్ పై వేధింపులకు పాల్పడ్డాడు.
రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తిరుపతిలోని వైద్యశాఖ అధికారులు కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి విచారణ జరిపారు.
బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎంపీహెచ్ డబ్ల్యూ సూపర్ వైజరు గా పని చేసే ఓ మహిళా ఉద్యోగినికి అక్కడే పని చేసే ఓ వైద్యుడు ఈ నెల 19వ తేదీన ఫోన్ చేసి పత్రికలో రాయలేని విధంగా బూతులు తిట్టారు.
అదేవిధంగా మెజేస్ లు…. వాయిస్ మెసేజ్ లు పంపారు. దీనిపై సదరు మహిళా ఉద్యోగి యూనియన్ నేతల ద్వారా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ వైద్యుడు గతంలో కూడా ఇలాగే చేయడం వలన ఇతర జిల్లా నుంచి ఇక్కడకు ఫనిష్ మెంటుపై వచ్చినట్లు బాధితురాలు, యూనియన్ నేతలు తెలిపారు.
మహిళా ఉద్యోగినిని అసభ్యంగా మాట్లాడిన వైద్యునిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
.

Discussion about this post