ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బి.సి. సంక్షేమ సంఘం, మాజీ ఉపాధ్యక్షుడు మరియు తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య, మాజీ రాష్ట్ర కార్యదర్శి డా.యం. ఉమేష్ రావు ఆధ్వర్యంలో స్ధానిక జయరాం రావు వీధి, పూసల వీధి కూడలి వద్ద “మహాత్మ జ్యోతిబా పూలే” జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమేష్ మాట్లాడుతూ పూలే సంఘ సంస్కర్తగా సమాజంలోని దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ” మహాత్మ ” అని పిలిపించుకొని , బడుగువర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసి భారతదేశ చరిత్రలో తనకంటూ ఒక గౌరవ స్ధానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి పురపాలక సంఘం, 18 వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె మాట్లాడుతూ లింగవివక్షకు వ్యతిరేకంగా పోరాడి స్త్రీల హక్కుల సాధనలో ఆదర్శవంతమైన పాత్రను పోషించిన వ్యక్తి పూలే గారని కొనియాడారు.
తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర కార్యదర్శి డా.దశరధాచారి ప్రసంగిస్తూ పూలే గారి ఆశయ సాధనలో ప్రతి ఒక్క బి.సి. భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. బి.సి. లు తమ న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం చిత్తూరు జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు నెమళ్ళూరు బుజ్జి మాట్లాడుతూ బి.సి.ల న్యాయపరమైన హక్కులను సాధించుకోవడానికి బిసి లందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం , చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షుడు కోట చంద్రశేఖర్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గుర్రప్ప శెట్టి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం, మాజీ వైస్ ఛైర్మన్ మిన్నల్ రవి, 24 వ వార్డు మాజీ కౌన్సిలర్ బీమాల మునికృష్ణ, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు డి.వి.నారాయణ, రాజేంద్ర నాయుడు, తెలుగుదేశం పార్టీ, బి.సి.విభాగం నాయకులు మునిరాజా యాదవ్, భాస్కర్, రఫీ, సికె బాబు, వంశీ, నూర్ మొహమ్మద్, మణి, అహ్మద్, తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య నాయకులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు.
.