• About Us
  • Contact Us
  • Our Team
Tuesday, July 28, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

Good Morning : సొంతవాళ్లే విలువ ఇవ్వరు!

admin by admin
October 16, 2021
0
Good Morning : సొంతవాళ్లే విలువ ఇవ్వరు!

‘నా భార్య దగ్గర నా మాటకు విలువ ఉండదు’ అని వాపోయే వాళ్లు మనకు ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు తారసపడుతూ ఉంటారు. అలాగే ‘మా ఆయనకి పొరుగింటి పుల్లకూరే రుచి’ అనే ఫిర్యాదు చేయని భార్య కూడా సాధారణంగా ఉండదు!! ఇది లోకరీతి. అత్యంత దగ్గరితనం, అత్యంత సాన్నిహిత్యం ఉన్న వారి విలువను మనం సరిగ్గా గుర్తించడం అనేది చాలా అరుదు! సాధారణంగా జరగదు.

ఇది ఏకపక్షంగా మనుషులకు విలువ ఇవ్వకపోవడం అని కూడా అనలేం. సహజంగానే మనకు దగ్గరివాళ్ల విలువ మనం గుర్తించలేం. వారిని ఎంతోకాలంగా మనం ఎరిగిఉండడం వలన, అంటే వాళ్లు గొప్పవాళ్లు కావడానికంటె ముందు నుంచి మనకు తెలిసి ఉండడం వలన వచ్చిన సమస్య ఇది. కొంచెం సానుకూలంగా, సావకాశంగా అర్థం చేసుకోలేకపోతే.. అతి దగ్గరి బంధాల మధ్యనే ఈ కారణంగా అసంతృప్తులు, అలకలు కూడా పుడుతుంటాయి.

సాధారణంగా ఇలాంటి అసంతృప్తులు కుటుంబాల్లోనే ఉంటాయి. ఆప్త బంధాల మధ్యనే ఉంటాయి. భర్త గొప్పతనాన్ని భార్య గుర్తించదు. తల్లిదండ్రులు చెప్పే సలహాలను పిల్లలు ఆలకించరు. తండ్రి చెప్పే సలహా కంటే.. ఎవరో చెప్పే సలహానే వారికి విలువైనదిగా అనిపిస్తుంటుంది. తండ్రుల పరిస్థితి కూడా అంతే. తమ సొంత కెరీర్ గురించి కూడా పిల్లలు చెబుతున్న ఆలోచనల్ని, తండ్రులు ఒప్పుకోరు. ఎవ్వరో దారిన పోయే వాళ్ల సలహాలను అడిగి.. ఆ సలహాలను తమ పిల్లల మీద రుద్దాలని అనుకుంటారు. ఇలాంటి అసంతృప్తి ఉభయ పక్షాలలోనూ ఉంటుంది.

మిత్రుల మధ్య కూడా ఇది ఉంటుంది. ఒకడిని మనం చిన్నతనం నుంచి చూస్తూనే ఉంటాం. ఒక రంగంలో వాడు మహానుభావుడిగా ఎదిగిపోతాడు. ఆ రంగం గురించిన అవగాహన, జ్ఞానం ఉండి.. ఆ రంగంలో అతని విలువను గుర్తించగలిగే పరిణతి మనకు ఉండే కొద్ది సందర్భాలలో ఓకే. కానీ చాలాసందర్భాలలో అలా జరగదు.

చిన్నతనం నుంచి ఎరిగిన సన్నిహిత మిత్రులు మీ గొప్పదనం పట్టించుకోరు. మాటకు విలువ ఇవ్వరు. ఇది హర్ట్ చేస్తుంటుంది. అయినా తప్పదు.

ఎంతో సన్నిహితమైన బంధాల మధ్యనే ఇలాంటి ఇబ్బంది ఉంటుంది. ఇదే విషయానికి ఇంకో కోణం కూడా ఉంది.

అతిగా సలహాలు ఇస్తూ పోతే.. ఆ మాటకు విలువ తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి, అవసరమైనప్పుడు మాత్రమే ఇచ్చే సలహాకే మన్నన దక్కుతుంది.  డిమాండ్ అండ్ సప్లయి సూత్రమే ఇక్కడ కూడా పని చేస్తుంది. మన చనువు, దగ్గరితనం, మన సలహాలు ‘సప్లయి’ ఎక్కువ అయిపోతే.. వాటికి ‘డిమాండ్’ ఉండదు. ‘డిమాండ్’ ఉన్నప్పుడు మాత్రమే చెబుతూ ఉంటేనే ఆదరణ.

ఇదే విషయాన్ని మనకు ఓ సుభాషితం కూడా చెబుతుంది.

అతిపరిచయాత్ అవజ్ఞా సంతతగమనాత్ అనాదరో భవతి
మలయే భిల్లా పురంధ్రీ చందనతరు కాష్ఠం ఇంధనమ్ కురుతే

అతిగా పరిచయం ఉన్న వారి దగ్గర అనాదరణ మాత్రమే లభిస్తుంటుంది. ఎలాగంటే.. కొండల్లో అడవుల్లో ఉండే మహిళ చందన వృక్షాల కొమ్మలను కూడా.. వంటచెరకుగా పొయ్యిలో మండిస్తున్నట్లుగా..! అనేది శ్లోక భావం.

మనకు బాగా దగ్గరి వ్యక్తుల గొప్పతనం మనకు తెలియదు. వాళ్లు గొప్పవాళ్లని ఒప్పుకోము, గుర్తించము. చిక్కటి చందనం చెట్లు పెరిగిన అడవుల్లో నివసించే మహిళ.. ఆ చందనం చెట్టు కర్రలనే పొయ్యిలో పెట్టి మంట రాజేసి వంట చేసుకుంటూ గడుపుతుంటుంది. ఆ చందనం చెట్ల అనాయాసమైన లభ్యత ఆమెకు ఎక్కువగా ఉండడం వల్ల.. సాధారణంగా వాటి విలువ ఆమెకు తెలియదు.

ఆ చెట్లు ఆమె నాటి పెంచినవి కాదు. అలాగైతే కొంత విలువ తెలిసేది. అలా కాకపోవడం వల్ల.. వాటిని పొయ్యిలో పెడుతుంటుంది. అదే  ఆమె, చందనం విలువ తెలిసి, కష్టపడి నాటి పెంచిన మొక్క అయిఉంటే గనుక.. దాని కొమ్మను పొయ్యిలో పెట్టేది కాదు.

వ్యక్తుల విషయంలో కూడా అంతే. వారి గొప్పతనం తెలిసి.. అతి ప్రయత్నం మీద వారితో స్నేహం కుదుర్చుకుని ఉంటే వారి మాటను విస్మరించలేరు. కానీ.. అతిగా ఏర్పడిన సహజబంధం వలన గుర్తించరు అంతే.

రెండో కోణం ప్రకారం.. అతిగా అడగకుండా మాట్లాడడం కూడా విలువను పలచన చేస్తుంది.

ఈ సత్యాన్ని గుర్తు పెట్టుకుంటే.. మన మాటకు దగ్గరివాళ్లు విలువ ఇవ్వకపోయినా సరే.. మనకు ఎన్నటికీ అసంతృప్తి కలగదు. అలాగే.. మనకు దగ్గరి వాళ్లు అయినంత మాత్రాన ఆప్తుల విలువను మనం గుర్తించకుండా కూడా ఉండము.

శుభోదయం

 

ఇవి కూడా చదవండి :
సురేష్ పిళ్లె : ఒక మా ఎలక్షన్.. మీడియా ఓవరాక్షన్
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2

Tags: BhartrihariBhartrihari subhashithamgood morninggood morning thoughtquotes on agriculturequotes on good thoughtsrelationssubhashitamsubhashithamvalue otherswhat to sowwhat you sow is what you reapభర్తృహరి సుభాషితంమంచిమాటశుభోదయంసుభాషితం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply