• About Us
  • Contact Us
  • Our Team
Monday, July 27, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఒక ‘మా’ ఎలక్షన్- ఎందరెందరిదో ఓవరాక్షన్!

admin by admin
October 11, 2021
0
ఒక ‘మా’ ఎలక్షన్- ఎందరెందరిదో ఓవరాక్షన్!

ఆదివారం వరకు తెలుగు న్యూస్ ఛానెల్స్ చూసిన కొత్తవారు ఎవరైనా ఉంటే.. మొత్తం తెలుగుజాతిని, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించిన పదికోట్ల మంది తెలుగువాళ్ల జీవితాల రూపురేఖలను సమూలంగా మార్చేసే కీలక ఎన్నికలు ఏవో జరుగుతున్నట్లుందే అనే భ్రమకు లోనయ్యే అవకాశం ఎక్కువ. నిజానికి జరిగింది ‘మా’ ఎన్నికలు.

మీడియా ఓవరాక్షన్ అనేది చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. టీఆర్పీ రేటింగుల గొడవ కావొచ్చు. వ్యూస్ తూకం రాళ్లతో సక్సెస్ ను కొలిచే వ్యవహారాలు అన్నీ కలిపి మా ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకంటె చాలా తీవ్రమైనవిగా, ముఖ్యమంత్రి కంటె చాలా ముఖ్యమైన వ్యక్తి ఈ ఎన్నికల ద్వారా ఆవిర్భవించబోతున్నట్టుగా ప్రజలను భ్రమల్లో పెట్టాయి. ప్రజలు కూడా అంతే ఆసక్తిగా తిలకించారు. ఇదంతా మీడియా ఓవరాక్షన్ పుణ్యమే!

నిజం చెప్పాలంటే, ప్రజలు ఆసక్తిగా తిలకించారు అనడనం కంటె.. వేలం వెర్రిగా చూస్తూ కూర్చున్నారు.. అంటే సబబుగా ఉంటుంది. ప్రజల బుర్రల్లో ఆ వేలంవెర్రితనాన్ని పుష్కలంగా టీవీ ఛానెళ్లు ఎక్కించాయి.

నిజానికి ఓవరాక్షన్ చేసింది కేవలం మీడియా మాత్రమే కాదు. బరిలో దిగిన అభ్యర్థుల నుంచి వారి వారికి మద్దతిచ్చిన వారికి వరకు చాలమంది అదే ఓవరాక్షన్ చేశారు.

మా ఎన్నికలు పూర్తయిపోయాయి కాబట్టి.. ఫలితాలు కూడా వెల్లడైపోయాయి కాబట్టి.. కొన్నిరోజులుగా జరిగిన అనేకానేక ఓవరాక్షన్ ల గురించి తర్కించుకోవడం సబబుగానే ఉంటుంది.

అసలు ‘మా’ స్థాయి ఎంత?

మా ఎన్నికల సందర్భంగా జరిగిన హడావిడిని చూస్తే ఎవరైనా సరే.. ఇది ఎంత పెద్ద సంఘమో కదా.. అని నివ్వెరపోయే ప్రమాదమే ఎక్కువ. ఇంతా కలిపి మా స్థాయి ఎంతో తెలుసా? అందులో ఉన్నది 926 మంది సభ్యులు.. (ఎన్నికల తర్వాత ఇప్పటికి ఇద్దరు రాజీనామాలు కూడా చేశారు)! అందులో 883 మంది మాత్రమే ఓటర్లు. సంఖ్యాపరంగా చూసినప్పుడు చాలా చిన్న సంఘం అది.

అనగా ఏమిటన్నమాట.. మా ఎన్నికల్లో గెలిచే నాయకులు ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసినా.. యావత్ సభ్యులను అపర కుబేరులుగా మార్చేసినా.. వారి బతుకులను ఉద్ధరించేసినా.. ఆ ప్రభావం వలన బాగుపడే జీవితాల సంఖ్య వెయ్యి కూడా లేదు. అయినా సరే బ్రహ్మాండం బద్ధలైనంత ప్రచారం జరిగింది.

పోటీపడిన వారి సంగతేమిటి?

సాధారణంగా ఎన్నిక చిన్నదైనా పెద్ద పెద్ద సెలబ్రిటీలు రంగంలో ఉన్నప్పుడు దాని మీద మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అయితే  మా బరిలో ఈసారి మరీ మహామహులు లేరు. మంచు విష్ణు కమర్షియల్ గా ఎన్నడో ఒకటిరెండు మినహా.. బ్లాక్ బస్టర్ అంటూ లేని హీరో. మరోవైపు ప్రకాష్ రాజ్! ఎంత ప్రతిభ గల నటుడు అయినా.. ప్రజల్లో బీభత్స ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి  కాదు. పెద్ద హీరోల చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు చేయడం తప్ప, తనే నాయకుడిగా కథను నడిపించిన చిత్రాలన్నీ పేరుతెచ్చినా.. నష్టాలు కూడా తెచ్చినవే. రాజకీయాల్లో కూడా విఫలప్రయోగల వ్యక్తి.

ఇలాంటి ప్రజల్లో క్రేజ్ లేని నటుల పోటీకే ఇంత ఓవరాక్షన్ చేసిన మీడియా.. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి వాళ్లు పోటీ పడి ఉంటే.. ఇంకేం చేసి ఉండేదే తలచుకుంటేనే గుండె గుభిల్లుమంటోంది.

వారి ఓవరాక్షన్ ఎంత?

ప్రకాష్ రాజ్ ఓడిపోయి ఉండవచ్చు గాక.. కానీ ఆయనను ఓడించడానికి ఆయన లోని క్రమశిక్షణ రాహిత్యం, నిర్మాతలను ఏడిపించే అలవాటు, ఇతర దుర్మార్గ లక్షణాలను మరింత ఎత్తిచూపించి గెలిచి ఉండవచ్చు. కానీ.. ప్రకాష్ రాజ్ పరభాషా నటుడు గనుక. అతడిని ఓడించాలనే ప్రచార ఎజెండాతో వెళ్లడం కరెక్టు కాదు అనిపిస్తుంది. కానీ,

nothing is unfair in war and love అని పెద్దలు అంటారు. మంచు విష్ణు కూడా అలాంటి స్ట్రాటెజీనే అవలంబించాడు అనిపిస్తుంది. తీరా యుద్ధం ముగిసింది. ఇప్పుడిక unfair వ్యవహారాలు, మాటలు, నిందలు, దెప్పిపొడుపులు ఏమీ ఉండకపోవచ్చు. కానీ పరాజితుడు అప్పుడే పలాయనం చిత్తగించేశాడు.

ఇవి కూడా చదవండి :
Movie Review : తప్పక చూడదగిన చిత్రం క్రిష్-వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’
జనంమెచ్చిన సీఎం.. ఆడు మగాడ్రా బుజ్జీ
నయీమ్ ఇట్లో పాములు తేళ్ల పెంపకం.. ఎందుకో తెలుసా?

‘బాధతో తీసుకున్న నిర్ణయం కాదు’ అంటూనే మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. మధ్యలో ప్రకాష్ రాజ్ కు తాను మద్దతిచ్చినా.. మా సభ్యులు ఆయనను గెలిపించలేదు గనుక.. అలిగి మెగాస్టార్ సోదరుడు నాగేంద్రబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇంకో ఓవరాక్షన్ ప్రతీక.

మా నాయకులు ఏం చేయగలరు?

మా పదవుల్లోకి కొత్తవారు వచ్చారు. అసలు ఈ మా నాయకులు ఏం చేయగలరు? వీరి మా కమిటీ వలన సామాన్యులకు వీసమెత్తు ప్రయోజనంగానీ, ప్రభావంగానీ ఉంటుంది. సినిమాల నాణ్యతను వీరు ఏమైనా నిర్దేశించగలరా? సినిమాలు సామాన్యులకు మరింత చేరువ చేయగలరా? లాంటి ఈ ఎన్నికలను సామాన్యుడికి ముడిపెట్టే ప్రశ్నలు ఎన్నివేసినా.. ఒక్క జవాబు కూడా ఉండదు.

ఎందుకంటే.. సామాన్యులకు ఈ ఎన్నికలకు సంబంధం ఇసుమంతైనా లేదు. అయినా సరే.. లక్షలాది మంది ప్రజల నుంచి కోట్లాది పనిగంటల సమయాన్ని ఈ మా ఎన్నికల కు సంబంధించిన హడావుడి హరించివేసింది. ఈ ఓవరాక్షన్ కు బాధ్యత అందరిదీ.

మీడియా మాత్రం మా ఎన్నికల విషయంలో గరిష్టంగా ఓవరాక్షన్ చేసింది. అయితే మీడియాకు పోటీగా.. చాలా మంది చాలా రకాలుగా ఓవరాక్షన్ అనేదే పరమావధిలాగా ఈ ఎన్నికల విషయంలో వ్యవహరించారు. ఎన్నికల పర్వానికి తెరపడిన తర్వాత అయినా.. మీడియా విచక్షణను పెంచుకుని.. ప్రాధాన్యాలను తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు తెలుసుకుని ఏం లాభం అనకుండా, పోస్టుమార్టం నిష్ప్రయోజనం అనుకోకుండా.. సానుకూలంగా చూస్తే.. మరోసారి ఇలాంటి చిన్న చిన్న సంఘాల ఎన్నికలకు ఇంత అతి ప్రచారం ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. మా నాయకులు, ఔత్సాహికులు మాట అదుపును కూడా పాటిస్తే బాగుంటుంది.

.. సురేష్ పిళ్లె,
సంపాదకుడు, ఆదర్శిని

ఇవి కూడా చదవండి :
హవ్వ.. రాజగురువు చెప్పినట్టే టీటీడీ ఆడుతోందా? 
రామ్ బాణం : జర్నలిస్టులకు నోబెల్ శాంతి బహుమతి.. జర్నలిజం ప్రపంచానికే స్ఫూర్తి
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం :   జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
గ్యాంగ్ స్టర్ నయీమ్ అనుచరుడే వంద కోట్లు సంపాదించాడంటే…?

 

Tags: maa election resultsmaa new presidentmaa president manchu vishnumanchu victorymanchu vishnumanchu vishnu panel winsmedia role in maa electionsmegastar chiranjeevi blessing didn't workmovie arist associationnagababu resignationprakash raj defeatమంచి విష్ణు ప్యానెల్ విజయంమా ఎన్నికల్లో మంచు విష్ణు విజయంమా ఎన్నికల్లో మీడియా పాత్రమా ప్రెసిడెంట్ గా మంచు విష్ణుమీడియా ఓవరాక్షన్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

19.7.26 కథానిధి సమీక్ష: సమకాలీన కల్లోల జీవిత చిత్రణ

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

12 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

ఆర్టీసీకి జరిమానా : ఇలా చేస్తే ప్రజలకే నష్టం!!

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply