ఒక చిన్న పొడుపు కథ! ‘ఒక గురువు- అతనికి ఒక శిష్యుడు. ఆ శిష్యుడికి- మరొక శిష్యుడు!’ ఈ పొడుపు కథలో మొత్తం ఎందరు గురువులు.. ఎందరు శిష్యులు ఉన్నారో చెప్పగలరా? ‘‘ఒకపిల్లి.. దాని ముందొక పిల్లి. రెండు పిల్లుల ముందొక పిల్లి. పిల్లి వెనక రెండు…’’ ఈ సరదా పొడుపుకథ గుర్తుకొస్తోందా?
ఎన్ని పిల్లులో చెప్పగలరేమో గానీ.. ఎందరు గురువులో- ఎందరు శిష్యులో చెప్పడం కష్టం. ఎందుకంటే.. ఆ పొడుపు కథలో ఉన్నది కేవలం ఒకే గురువు- ఒకే శిష్యుడు! అదెలాగ అంటున్నారా.. ఆ తమాషానే గ్యాంగ్‌స్టర్ నయీమ్ జీవితం ఆధారంగా దాము బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘నయీమ్ డైరీస్’ సినిమాలో ప్రధానంగా కనిపించబోతోంది.
గ్యాంగ్‌స్టర్ గా మారిన మాజీ నక్సలైట్ నయీమ్ జీవిత కథ ఆధారంగా ‘నయీమ్ డైరీస్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సిఎ వరదరాజు దీనికి నిర్మాత. ఈ చిత్రంలో ఓ ఆసక్తికర సన్నివేశం ఉంటుంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ తెచ్చుకున్న నయీమ్ ను పీపుల్స్ వార్ నక్సలిజం వైపు ఆకర్షితుణ్ని చేసిన వ్యక్తి ఒకరున్నారు. ఆయన అప్పట్లో పార్టీకి భువనగిరి టౌన్ ఆర్గనైజర్ గా పనిచేసేవారు. పార్టీలో వారిని సీఓ (సెంట్రల్ ఆర్గనైజర్) అని వ్యవహరిస్తారు. 1986 ప్రాంతంలో నయీమ్ ను పార్టీకి పరిచయం చేసి నక్సలిజం లోకి తీసుకువెళ్లాడు. తర్వాతి పరిణామాలు అందరికీ తెలిసిందే. అంటే సదరు పీపుల్స్ వార్ సీఓ నయీమ్ కు తొలి గురువు అన్నమాట.
ఇవి కూడా చదవండి :
నయీమ్ డైరీస్ : నక్సల్ జీవితాల నగ్న స్వరూపం!
నయీమ్ డైరీస్ : డైరక్టర్ కు పోలీసు ఫత్వా ఏంటో తెలుసా?
ప్రకాష్ రాజ్ కోసం పవన్ రాయబారం!
1999లో నయీమ్ బయటకు వచ్చి నక్సలైట్ల మీద కక్ష కట్టి తన కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత.. అప్పటి తొలి గురువు మళ్లీ వచ్చి నయీమ్ అసిస్టెంటుగా చేరాడు. ఒకప్పటి నక్సలైట్ గురువు, ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ శిష్యుడుగా కుదురుకున్నాడు! ఆ రకంగా చూసినప్పుడు తొలుత చెప్పుకున్న పొడుపు కథ సరిపోతుంది కదా! ‘ఒక గురువు- అతనికి ఒక శిష్యుడు. ఆ శిష్యుడికి- మరొక శిష్యుడు!’ అంతా కలిపి ఉన్నది ఇద్దరే!
అయితే ట్విస్టు ఏమిటంటే.. సదరు నయీమ్ గురువు మరియు శిష్యుడు అయిన ఆ వ్యక్తి.. గ్యాంగ్‌స్టర్ గా నయీమ్ అనుచరుడిగా ఉంటూ.. వందకోట్ల వరకు సంపాదించాడని పార్టీలో అనుకుంటూ ఉంటారు. పీపుల్స్ వార్ నక్సలైట్లే.. తిరిగి జనజీవనంలోకి వచ్చిన తర్వాత.. తప్పుడు మార్గం తొక్కితే ఎంతగా చెలరేగిపోతుంటారనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే!
ఇవి కూడా చదవండి :
బద్వేలును వదిలించుకోవాలని మిత్రులిద్దరిలో ఆరాటం
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
Discussion about this post