గ్యాంగ్‌స్టర్ నయీమ్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతం అయినప్పుడు.. అతని గురించి అనేక అంశాలు కథలు కథలుగా ప్రచారంలోకి వచ్చాయి. అమ్మాయిల వ్యాపారం, భూకబ్జాలు, దందాలు, బెదిరింపులు, కిరాయి మర్డర్లు, కౄరత్వం అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కథల ఉధృతిలో నయీమ్ లోని అసలైన, ఒరిజినల్, అతని మూలాలను గురించి తెలియజేసే కేరక్టర్ ‘నక్సలైట్ నయీమ్’ అనే పేరు మరుగున పడిపోయింది.
కథలు మాత్రమే ప్రచారంలోకి వస్తే.. కథలకు మాత్రమే ఆదరణ దక్కితే కొన్నాళ్లకు అవే చరిత్రగా మారిపోతాయి. నిజానిజాల ఊసు మరెవ్వరికీ పట్టదు. ఇలాంటి ఆలోచనతోనే.. ‘గ్యాంగ్‌స్టర్ నయీమ్’ గా హతమైపోయిన ‘నక్సలైట్ నయీమ్’ జీవితంలోనే అనేక పార్శ్వాలను తొలినుంచి స్పృశిస్తూ రూపొందిన చిత్రం ‘నయీమ్ డైరీస్’. ఇప్పుడు ఇది విడుదలకు సిద్ధం అవుతోంది. పీపుల్స్ వార్‌లో పనిచేసి, విరసం చురుకైన కార్యకర్తగా ఉండి ప్రస్తుతం ప్రజాజీవితంలో ఉన్న దామూ బాలాజీ దీనికి దర్శకుడు!
‘నయీమ్ డైరీస్’ పేరుతో రూపొందిన చిత్రం ప్రస్తుతం విడుదలకు ముస్తాబు అవుతోంది. అక్టోబరు నెలాఖరు లేదా నవంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.అయితే అత్యంత వివాదాస్పదుడైన మాజీ పీపుల్స్ వార్ కార్యకర్త నయీమ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం కేవలం నయీమ్ జీవిత సంఘటనలను మాత్రమే కాకుండా.. అతని జీవితంతో స్నేహంతోనూ, వైరంతోను ముడిపడిన నక్సలైట్ ఉద్యమ వ్యవహారాలను కూడా ఉన్నదున్నట్టుగా తెలియజెప్పే ప్రయత్నం జరుగుతోంది.
విడుదలకు ముందే ఈ చిత్రం కొంత సంచలనాన్ని రేకెత్తిస్తోంది. నయీమ్ వ్యక్తిత్వంలో ఉన్న ఆవేశం, అతని కుటుంబం మొత్తాన్ని పీపుల్స్ వార్ సాయుధ పోరాటంవైపు ఎలా నడిపించింది అనే దగ్గరినుంచి.. నయీమ్ ను మాత్రమే కాదు అతడి కుటుంబం అంతటినీ అటు నక్సల్స్ గానీ, ఇటు పోలీసులు గానీ ఎలా తమ తమ అవసరాలకు వాడుకున్నారు అనే వరకు రకరకాల అంశాలు ఇందులో ఉండబోతున్నాయి.
దర్శకుడు దాము బాలాజీ.. తనకు స్వయంగా పీపుల్స్ వార్ ఉద్యమ నేపథ్యం ఉండడంతో.. లోతుగా నయీమ్ జీవితం గురించి అప్పటి పరిణామాల గురించి… అతనిలో కేరక్టర్ మార్పు జరిగిన దశల గురించి తెలుసుకుని సినిమాను రూపొందించినట్లుగా చెబుతున్నారు.
బెంగుళూరులో నిర్మాణరంగంలో ఉన్న సిఎ వరదరాజు ఈ చిత్రానికి నిర్మాత. కన్నడ నటుడు వశిష్ట సింహా నయీమ్ పాత్రను పోషిస్తున్నారు. నారప్ప చిత్రంలో విలన్ పాత్ర ద్వారా వశిష్ట సింహా తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయం అయ్యారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ రెండు భాషల్లోనూ ఏకకాలంలో రూపొందింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇవి కూడా చదవండి :
మిత్రులకు ‘శుభోదయం’ సందేశాలు పంపడానికి సుభాషితాలు ఎంచుకోండి..
సినిమా ఇండస్ట్రీలో అరాచక విశృంఖలపోకడలపై సీనియర్ జర్నలిస్ట్ ‘రామ్’బాణం
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
కేబినెట్ ప్రక్షాళన ఒక సమరం : జగన్ vs ముగ్గురు బలమైన మంత్రులు
రోజా సీటు కింద పెద్దిరెడ్డి కుంపటి రాజేస్తున్నారా
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం న్యాయమే
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2
పవన్ కల్యాణ్ ఒంటరి అయిపోయాడా?
అవినీతి కేసుల్లో ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మి .. తర్వాత ఎపీ సీఎస్ అవుతారా?
.