• About Us
  • Contact Us
  • Our Team
Friday, September 11, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

నయీమ్ డైరీస్ : డైరక్టర్‌కు పోలీస్ ఫత్వా ఏంటో తెలుసా?

admin by admin
October 5, 2021
0
నయీమ్ డైరీస్ : డైరక్టర్‌కు పోలీస్ ఫత్వా ఏంటో తెలుసా?

గ్యాంగ్‌స్టర్‌గా మారిన నక్సలైట్ నయీమ్ జీవితం ఆధారంగా.. రూపొందిన చిత్రం ‘నయీమ్ డైరీస్’ త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే నయీం జీవిత కథ వెండితెరకు ఎక్కుతున్నదనే సంగతి తెలియగానే.. తెలంగాణ పోలీసు బాస్ లు ఇందులో ఉత్సాహం చూపించారు. ఏం తెలుసుకున్నారు? సినిమా డైరక్టర్ కు ఏం ఆదేశాలు ఇచ్చారు?

నయీమ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద గ్యాంగ్ స్టర్ అయినా.. పోలీసులతో చాలా సన్నిహిత సంబధాలు ఉన్నట్టుగా తొలినుంచి ప్రచారం ఉంది. ఆయన కార్యకలాపాలు, వ్యవహారాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉండేవి. నిజానికి పీపుల్స్ వార్ లో చురుగ్గా పనిచేసిన నక్సలైటుగా జైలు శిక్ష అనుభవిస్తూ ఉండిన నయీమ్.. పోలీసుల పురమాయింపుతోనే బయటకు వచ్చి కొత్త దందాలు ప్రారంభించాడని అంటారు. అదంతా వేరే కథ గానీ.. నయీమ్ కథ తెరకెక్కుతోందనగానే.. ఎందరు పోలీసు అధికారుల బాగోతాలు కతలు కతలుగా వెల్లడి అవుతాయోనని పలువురు ఎదురుచూడడం సహజం. అందుకే బహుశా, తెలంగాణ పోలీసు పెద్దలు కూడా సినిమా రూపొందకముందే దానిమీద
ఆసక్తి చూపించారు.

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్లో కడతేరిపోయినప్పడు.. పోలీసు అధికార్లతో నయీమ్ కు ఉండే సంబంధ బాంధవ్యాల గురించి అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. గొప్ప క్రైం థ్రిల్లర్ లను తలపించే విధంగా అప్పట్లో కథనాలు వచ్చాయి. చాలా మంది పోలీసు అధికారులు.. శాఖాపరమైన విచారణను ఎదుర్కొన్నారు కూడా. నయీమ్ తో సంబంధాల గురించి సంజాయిషీలు చెప్పుకున్నారు.

అలాంటి నేపథ్యంలో నయీమ్ మీద సినిమా తయారవుతున్నప్పుడు.. పోలీసులతో ఉండే సంబంధాలన్నీ అందులో యథాతథంగా వచ్చేస్తే డిపార్ట్మెంటు పరువు పోతుంది కద.. అనే భయం పోలీసు పెద్దల్లో ఉన్నట్టుంది. అది నిజమైనా కాకపోయినా.. మాజీ నక్సలైట్ జీవిత కథను సినిమాగా తీస్తున్నప్పుడు.. దాని ట్రీట్మెంట్.. నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షించేలా కనిపిస్తుందేమో అనే అనుమానం కూడా ఉండవచ్చు .

మొత్తానికి పోలీసు పెద్దలు ఈ చిత్ర దర్శకుడు దామూ బాలాజీని పిలిపించారు. వివరాలు అడిగారు. స్వయంగా పీపుల్స్ వార్ లో పనిచేసిన అనుభవం కూడా ఉన్న దర్శకుడు దామూ బాలాజీ.. కథను బయటపెట్టకుండానే.. ఎలాంటి రీసెర్చి చేసి ఆ కథ తయారుచేశాడో.. ఎవరెవరి ద్వారా వివరాలు తెలుసుకున్నాడో చెప్పాడు. నిజాల్నే సినిమాగా తీస్తున్నానని వారితో అన్నాడు. మొత్తానికి ఇదేదో పైపైనే తీసేస్తున్న సినిమా కాదని, లోతుగా నయీమ్ జీవితం గురించిన చర్చ ఇందులో ఉంటుందని పోలీసు బాస్ లు కూడా నమ్మారు.

అయితే సినిమా టైటిల్ దగ్గరే వారికి పేచీ వచ్చింది. ‘నయీమ్ డైరీస్’ అనే టైటిల్.. ఆ గ్యాంగ్ స్టర్ ను హీరోయిగ్గా చూపిస్తుందేమో అనే అనుమానం వారికి కలిగింది. టైటిల్ మార్చాలని డైరెక్టర్ ను అడిగారు. అయితే దామూబాలాజీ పోలీసు మాటకు లొంగలేదు. టైటిల్ మార్చడంలో ప్రాక్టికల్ గా ఉండే సాధకబాధకాల్ని వివరించి వారిని ఒప్పించారు. మొత్తానికి యథాతథంగా ‘నయీమ్ డైరీస్’ అనే టైటిల్‌తోనే సినిమా మన ముందకు రాబోతోంది.

ఇవి కూడా చదవండి :

మిత్రులకు ‘శుభోదయం’ సందేశాలు పంపడానికి సుభాషితాలు ఎంచుకోండి..
సురేష్ పిళ్లె : ఒక కలం చావు.. వేయి కలల చావు.. జర్నలిజంలో పెడపోకడలు..
వేదనలో సమంత.. లొకేషన్ లోనే కన్నీళ్లు పెట్టుకున్న వైనం
movie review : కంటతడి పెట్టించే సినిమా ‘రిపబ్లిక్’
అరెస్టు నుంచి రక్షణ కవచం.. సిఆర్‌పిసి 41 (ఎ)
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 1
టీటీడీ బోర్డు భ్రష్టు పట్టిపోయిన చరిత్ర – పార్ట్ 2

టైటిల్ విషయంలో పోలీసుల మాటను డైరెక్టర్ ఖాతరు చేయలేదు సరే.. ఇంతకూ ఆ సినిమాలో.. నయీమ్ తో డిపార్ట్‌మెంట్ కు ఉండే సంబంధాలు పోలీసు శాఖ పరువుతీసేలా ఉండబోతున్నాయా? పక్కా రీసెర్చితో తీస్తున్న సినిమాలో.. పోలీసులతో అక్రమ సంబంధాలని కూడా ఉన్నదున్నట్టుగా చూపిస్తారా.. పోలీసుల పరువు సాంతం పోతుందా.. అనేది తెలియాలంటే.. విడులయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

Tags: damu balajidirector daamu balajigangster nayeemnaxalite movienaxalite nayeemnayeem diariespeoples war naxal movievasishta simhaగ్యాంగ్‌స్టర్ నయీమ్నయీమ్ డైరీస్
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

23 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

9.8.26 కథానిధి సమీక్ష: అక్షరాలే అసలైన కాపలాదారులు

‘యుద్ధాలు బలికోరేది మానవత్వాన్నేనా?’

9 ఆగస్టు 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

సురేష్ పిళ్లె: ఘనీభవన స్థితి ‘కడెవర్ భారతి’

చాగంటి ప్రసాద్: యతో కృష్ణ స్తతో జయః

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply