తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు, రెబల్ స్టార్, కేంద్రమాజీ మంత్రి కృష్ణం రాజుకు గవర్నర్ పోస్టు దక్కనుందనే ప్రచారం గురువారం రాజకీయ, సినీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సుదీర్ఘకాలంగా బీజేపీలో పనిచేస్తున్న కృష్ణం రాజును, కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు గవర్నరుగా పంపనున్నట్లు వార్తలు వచ్చాయి.
కృష్ణం రాజు.. నవతరం హీరోల్లో రెబల్ స్టార్ గుర్తింపు ఉన్న ప్రభాస్ కు స్వయానా పెదనాన్న. గతంలో ఆయన బీజేపీ తరఫున లోక్ సభ ఎంపీగా కూడా గెలిచారు. తర్వాతి కాలంలో కూడా పూర్తిగా బీజేపీ పార్టీతోనే అసోసియేట్ అయి ఉన్నారు.
పార్టీకీలక సమావేశాలకు ఇప్పటికీ హాజరవుతూ ఉంటారు. అలాంటి కృష్ణం రాజును గవర్నరుగా ఎంపిక చేయనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కృష్ణం రాజుకు సంబంధించిన వ్యక్తులు కూడా.. ఆయనకు ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు.
.

Discussion about this post