తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి సేవలో సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్దగొన్ర్శింనారు. అమిత్ షాకు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
సాంప్రదాయ అనుసారంగా అమిత్ షా ముందుగా ఆలయ ప్రాంగణంలోని వినాయకస్వామివారిని దర్శించుకుని ధ్వజస్తంభానికి నమస్కరించారు. స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు.
శ్రీ కామాక్షి అమ్మవారిని, శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారిని, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారిని దర్శించుకున్నారు. ఆ తరువాత చండీ హోమంలో పాల్గొన్నారు.
టిటిడి ఛైర్మన్, ఈవో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు, టిటిడి ముద్రించిన రూట్స్ అనే పుస్తకం, శ్రీవారి ప్రతిమ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిలు సిఎం.రమేష్, సుజనా చౌదరి, బోర్డు సభ్యులు కృష్ణమూర్తి వైద్యనాథన్, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, జెఈవో వీరబ్రహ్మయ్య, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, టీటీడీ అదనపు సివిఎస్వో శివ కుమార్ రెడ్డి, విజివో మనోహర్, డెప్యూటీ ఈవోలు సుబ్రమణ్యం, రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post