శ్రీకాళహస్తి నియోజక వర్గం ఐటీడీపీ (సోషల్ మీడియా) ఇన్ ఛార్జిగా శ్రీకాళహస్తికి చెందిన తుమ్మగుంట సాగర్ కృష్ణను నియమించారు.
ఈ మేరకు ఆయన ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు చింతకాయల విజయ్, పార్లమెంట్ అధ్యక్షులు యాచేంద్ర నాయుడు ఈయనకు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సాగర్ కృష్ణ మాట్లాడుతూ.. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులతో తనకు ఈ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. టీడీపీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియచేశారు. సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీ ఆగడాలను ఎండగడతానన్నారు.

.
Discussion about this post