సాధారణ ఎన్నికల సమయంలో మద్యపాన నిషేదం అమలు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇపుడు ఎందుకు అమలు చేయడం లేదని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు చక్రాల ఉష ప్రశ్నించారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మద్యపాన నిషేధం అమలు చేయాలని డిమాండు చేస్తూ సత్యవేడు శనివారం ఆ నియోజకవర్గం ఇన్ ఛార్జి జేడీ రాజశేఖర్ ఆధ్వర్యంలో నారాయణవనం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చక్రాల ఉష హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని… ఇపుడు మోసం చేస్తున్నారని విమర్శించారు. మద్యంతో మహిళల బతుకులు బజారున పడుతున్నాయని ఉష ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ధుకాణాల్లో నాసిరకం, కల్తీ మద్యం విక్రయిస్తున్నందున మందుబాబుల ఆరోగ్యం దెబ్బ తింటోందన్నారు. ప్రజల ఆగ్యంతో ఆటలాడుకుంటున్న జగన్ కు వారే బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
అంతకు మునుపు జేడీ రాజశేఖర్ మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి వచ్చిన్పటి నుంచి రక రకాల బ్రాండ్ల మద్యంతో పేద వారిని తాగించి వారి జీవితాలు నాశనం చేస్తున్నారని విమర్శించారు.
ద్యం కారణంగా కుటుంబాల్లో కలతలు రేగి… బతుకులు నాశనం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మందు కూడా అధిక ధరలకు అమ్ముతూ ఆ సొమ్ముతో ప్రభుత్వాన్నినడిపే పరిస్థితి ఈ రాష్ట్రనికి వచ్చిందని ఆయన ఎద్దేవా చేసారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాస్కర్, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి గోవిందస్వామి, లోకనాధం, జయంతి, రవి, పాల్గొన్నారు.
.