రిలయన్స్ జియో తన ఎనిమిదో వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఆ సందడి అంతా కూడా పరిశ్రమలోనే మొదటిసారి అని చెప్పదగ్గ చర్యలు, గణనీయ మైలురాళ్ల సాధనలో ప్రతిఫలిస్తోంది. 2016 సెప్టెంబర్ లో వాణిజ్యపరంగా ప్రారంభమైన నాటి నుంచి కూడా జియో నిలకడగా వినూత్నతలో అగ్రభాగాన ఉంటూ వచ్చింది. రేపటి తరం సాంకేతికతలను అనుసరించడాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
అంతే కాదు, జియో నెలకొల్పిన ప్రమాణాలు ఇప్పుడు పరిశ్రమకు ప్రమాణాలుగా మారాయి. సున్నా నుంచి 49 కోట్ల సబ్ స్క్రైబర్ బేస్ ను చేరుకుంది. అంతే కాదు, సున్నా నుంచి 8% దాకా అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ ను పొందింది. ఫలితంగా.. డాటా వినియోగంలో 2016 లో భారత్ 155 వ స్థానంలో ఉండగా, ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఈ ఎనిమిదేళ్ళ కాలంలో దేశంలో డాటా వినియోగం 73 రేట్లు పెరిగింది.
అగ్రగామిగా….
ఆరంభం నుంచి కూడా మార్కెట్లో సంచలనాలకు మారుపేరుగా నిలిచింది జియో. మొదటిసారిగా ఉచిత అపరిమిత కాల్స్, భారతదేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ ను ప్రవేశపెట్టింది. దేశానికి వాయిస్ ఓవర్ ఎల్టీఈ (విఒఎల్ టిఇ)ని తీసుకొచ్చిన ఘనత కూడా జియోకే దక్కింది. యూజర్లకు సెల్ఫ్ – కేర్ ప్లాట్ ఫామ్ మై జియో యాప్ ను కూడా జియో ప్రవేశపెట్టింది. వై-ఫై కాలింగ్ ను ప్రవేశపెట్టడం ద్వారా కనెక్టివిటీ ఆప్షన్లను జియో మరింతగా మెరుగుపర్చింది. అంతేగాకుండా 4జి ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెట్టడం ద్వారా డిజిటల్ సేవలు పొందడాన్ని విప్లవీకరించింది.
అన్నిటికీ మించి జియో దేశీయంగా అభివృద్ధి చెందింది. ఫుల్లీ క్లౌడ్ – నేటివ్, సాఫ్ట్ వేర్ – డిఫైన్డ్, డిజిటల్ గా నిర్వహించగలదిగా ఎండ్ టు ఎండ్ 5జి స్టాక్ ను ప్రవేశపెట్టింది. క్వాంటమ్ సెక్యూరిటీ వంటి అధునాతన ఫీచర్లను ఈ 5జి స్టాక్ సపోర్ట్ చేస్తుంది. సాంకేతికతపరంగా ముందంజలో ఉండేందుకు జియో కు గల కట్టుబాటును ఇది చాటిచెబుతుంది. అంతేగాకుండా 4జి మౌలిక వసతులపై ఏమాత్రం ఆధారపడకుండా, భారతదేశంలో విడిగా 5జి నెట్ వర్క్ ను ఏర్పాటు చేసిన ఘనతను కూడా జియో దక్కించుకుంది.
మైలురాళ్లు
ఏళ్లుగా జియో తన సర్వీస్ ఉత్పత్తులను క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 2023లో జియో సంస్థ జియో భారత్, జియో బుక్, జియో ఎయిర్ ఫైబర్ లను ప్రవేశపెట్టింది. జియో సబ్ స్క్రైబర్ల సంఖ్య ఊహకు అందని రీతిలో పెరిగింది. 2024 ఆగస్టు నాటికి 49 కోట్లకు చేరుకుంది. వారిలో 13 కోట్ల మంది 5జి యూజర్లుగా ఉన్నారు. ఈ వృద్ధ గాధ అంతా కూడా ఎన్నో కీలక మైలురాళ్లతో ఉంది. 2022 జియో ట్రూ5జి ఆవిష్కారం, 2021 లో జియోఫోన్ నెక్ట్స్ ను ప్రవేశపెట్టడం, జియో ఫైబర్ దేశంలో నంబర్ వన్ ఫైబర్ -టు-ది-హోమ్ (ఎఫ్ టిటిహెచ్) ప్రొవైడర్ కావడం లాంటివన్నీ వీటిలో ఉన్నాయి.
డేటా, వాయిస్ వినియోగం గణాంకాలను చూస్తే జియో ఎంత వేగంగా వృద్ధి చెందిందో తెలుస్తుంది. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే ఈ నెట్ వర్క్ 148.5 బిలియన్ జీబీల డేటాను, 5.5 ట్రిలియన్ నిమిషాల వాయిస్ ను నిర్వహించింది. ఆరంభ సంవత్సరాల్లోని తలసరి వినియోగంతో పోలిస్తే గణనీయ వృద్ధిని సాధించింది. 2016 లో సగటు జియో వినియోగదారు 800 ఎంబీ ఉపయోగించగా, ఇప్పుడు ఇది నెలకు 30 జీబీగా ఉంది.
వ్యూహాత్మక కార్యక్రమాలు
వినూత్నతకు జియో కట్టుబడి ఉంది. ఆ సంస్థ పేటెంట్ పోర్ట్ ఫోలియోను చూస్తేనే ఈ విషయం అర్థమవు తుంది. ఇప్పటి వరకూ ఈ సంస్థ 1,687 పేటెంట్లకు దరఖాస్తు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన 1,255 దరఖాస్తులు కూడా వీటిలో ఉన్నాయి. 6జి, ఏఐ, బిగ్ డేటా, ఐఓటీ వంటి కీలక రంగాలకు కూడా ఈ పేటెంట్లు విస్తరించాయి. భారత్ ఇప్పుడు అంతర్జాతీయంగా అతిపెద్ద డేటా మార్కెట్ గా వృద్ధి చెందుతున్న నేపథ్యంలో జియో నెట్ వర్క్ ఇప్పుడు అంతర్జాతీయ డేటా ట్రాఫిక్ లో 8 శాతం వాటా కలిగి ఉంది. భారత్ మొత్తం డేటా ట్రాఫిక్ లో జియో 60 శాతం వాటా కలిగిఉంది.
రాబోయే రోజుల్లోనూ జియో తన జైత్రయాత్రను, మార్కెట్లో నాయకత్వ స్థానాన్ని కొనసాగించనుంది. భారతదేశ 5జి రేడియో కాల్స్ లో 85% తన నెట్ వర్క్ పరిధిలోనే ఆపరేట్ అవుతుండడంతో 5జీ విభాగంలో జియో తన నాయకత్వ స్థానాన్ని కొనసాగించనుంది. కంపెనీ భారీ స్థాయి ఏఐ మౌలిక వసతులను సమకూర్చుకుంటోంది. గిగావాట్ స్థాయి ఏఐ రెడీ డేటా సెంటర్స్ ను జామ్ నగర్ లో ఏర్పాటు చేసింది. ఇవి హరిత శక్తి (గ్రీన్ ఎనర్జీ)తో నడవడం విశేషం. ఈ చర్యలన్నీ కూడా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, చదువు, చిన్నతరహా వ్యాపార సంస్థలు మొదలైన రంగాలపై పరివర్తనదాయక ప్రభావాన్ని కలిగించనున్నాయి.
నిరంతరాయ వినూత్నతలో జియో 8 ఏళ్ల కాలాన్ని వేడుక చేసుకుంటున్న సందర్భంలో కంపెనీ విజన్ టెలికామ్ ను దాటి విస్తరించింది. 100 మిలియన్ ఇళ్లను, 20 మిలియన్ల చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను అనుసంధానించడం వంటి భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. భారత్, అంతకు మించి ప్రపంచ డిజిటల్ ముఖచిత్రాన్ని జియో విప్లవీకరించనుంది.
Discussion about this post