తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షులుగా శ్రీకాళహస్తికి చెందిన షేక్ మస్తాన్ ను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ తిరుపతి పార్లమెంటరీ విభాగం అధ్యక్షులు నరసింహయాదవ్ మంగళవారం నియామక ఉత్తర్వులను మస్తాన్ కు పంపారు.
ఈ సందర్భంగా మస్తాన్ మాట్లాడుతూ.. తాను మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో పని చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అభివృద్ధే తన ధ్యేయమన్నారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ ఛార్జి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సలతో తనకు ఈ పదవి దక్కిందన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి తనకు ఈ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుతో పాటు.. ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడమే తమ లక్ష్యమన్నారు. మైనార్టీల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని మస్తాన్ చెప్పారు.
కాగా మస్తాన్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేయడంతో పాటు.. ఆయనను అభినందించారు.
.