శ్రీకాళహస్తికి చెందిన కథా రచయిత, అరసం కార్యవర్గ సభ్యులు దేవీప్రసాద్ ఒబ్బు రచించిన ‘లోపలిమాట’ పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి శనివారం సాయంత్రం తిరుపతిలో పద్మావతి పురంలోని తన నివాసంలో ఆవిష్కరించారు.
సాహిత్యం అనేది సమాజంలో చైతన్యాన్ని సుసంపన్నం చేస్తుందని భూమన ఈ సందర్భంగా అన్నారు. లోపలి మాట వంటి అంతరంగ విశ్లేషణలతో కూడిన రచనలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు.
పుస్తక రచయిత దేవీప్రసాద్ ఒబ్బు మాట్లాడుతూ ప్రతి మనిషికీ వారి అంతరంగమే గొప్ప స్నేహితుడు అని.. మనం చేసే పనులను అంతరంగం ఎదుట తూకం వేసి చూసుకుంటూ ఉంటే వ్యక్తిత్వం మెరుగుపడుతుందని అన్నారు.
సమాజంలోని భిన్న పోకడలను, సామాజిక పతనాలను గమనించిన తన అంతరంగంలోని మధనానికి అక్షరరూపమే ఈ ‘లోపలి మాట’ వ్యాసాలు అని వివరించారు.
ఆదర్శిని డాట్ కామ్ లో ధారావాహికగా ప్రచురించిన వ్యాసాలను ఆదర్శిని మీడియా ప్రచురించింది.
ఈ కార్యక్రమంలో మానవ వికాస వేదిక సమన్వయకర్త సాకం నాగరాజ, అరసం అధ్యక్షులు యువశ్రీ మురళి, కథా రచయిత పేరూరు బాలసుబ్రమణ్యం, బి.ఎన్.రెడ్డి, పార్షి బాలాజీ, మురళి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Discussion about this post