శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలసిన జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని శుక్రవారం నగరి శాసనసభ్యురాలు, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్ కే రోజా దర్శించుకున్నారు.
ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, రాష్ట్ర యాదవ సంఘం కార్పోరేషన్ డైరెక్టరు లోకేష్ యాదవ్ ఈమెకు స్వాగతం పలికారు. రోజా మొదట రాహు-కేతు సర్పదోష నివారణ పూజలు చేసుకున్నారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. గురుదక్షిణామూర్తి సన్నిధిలో ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. స్వామి, అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
కాగా రాష్ట్ర మంత్రి వర్గం విస్తరణ నేపథ్యంలో రోజా ముక్కంటి ఆలయానికి వచ్చి రాహు-కేతు పూజలు చేయించు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పూజల అనంతరం రోజా మాట్లాడుతూ.. శ్రీకాళహస్తీశ్వరుని జన్మనక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని దర్శనానికి వచ్చానని చెప్పారు.
మంత్రి వర్గంలో చోటు దొరుకుతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె నవ్వుతూ సమాధానం చెప్పకుండా వెళ్లి పోయారు.
.

Discussion about this post