మలయాళంలో సూపర్ హిట్ అయి, OTT లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న “అయ్యప్ప న్ కోషియం” సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేస్తున్నారనే వార్త అందరి దృష్టిని ఆకర్షించింది.
పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రలలో నటించిన “భీమ్లా నాయక్” సినిమా కొంతమేర మాతృకకు దూరంగా జరిగినా ప్రేక్షకుల అంచనాలను అందుకుందనే చెప్పాలి.
కథ విషయానికి వేస్తే భీమ్లా నాయక్ ( పవన్ కల్యాణ్) ఎస్ ఐ గా పనిచేస్తుంటాడు. డేనియల్ శేఖర్ ( రానా) మిలటరీ పనిచేసి వస్తాడు. మందు బాటిల్స్ తో కారులో వెళుతున్న డే నియల్ ని భీమ్లా నాయక్ బృందం పట్టుకుంటుంది.
డేనియల్ తండ్రి ఎంపిగా పనిచేశాడు. డేనియల్‌కు ఈగో ఎక్కువ. డేనియల్ పోలీసులను కొడితే, వారు తిరిగి కొడతారు. చివరికి డాని అరెస్ట్ అవుతాడు.
అక్కడి నుంచి భీమ్లా నాయక్, డానీ ల మధ్య సంఘర్షణే ఈ చిత్రం.
విశ్లేషణ :
మలయాళం మాతృక చాలా క్లాస్ గా ఉంటుంది. అయితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాతృకలో ప్రధాన అంశాన్ని తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గటుగా కథను మార్చేశాడు. దాంతో పాటు మంచి సంభాషణలు రాశాడు. దర్శకుడు సాగర్ చంద్ర ప్రతిభ కూడా తోడవడంతో భీమ్లా నాయక్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కథను బాగా నడిపారు. క్లైమాక్స్ లో సెంటిమెంట్ బాగా కుదిరింది.
పవన్ కళ్యాణ్, రానా లు తమ పాత్రలలో ఒదిగి పోయారు. వారిద్దరూ లేకుండా ఈ సినిమా ను ఊహించలేం. అలాగే సముద్ర ఖని, నిత్యా మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళి శర్మ.. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించారు. పవన్ కల్యాణ్ చరిష్మా ఎంటో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అంత గొప్పగా చేశాడు.
టెక్నికల్ గా చూస్తే తమన్ సంగీతం పెద్ద అస్సెట్. సెకండ్ హాఫ్ లో వచ్చే భీమ్లా పాట గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. నేపథ్య సంగీతం చాలా బావుంది. రవి చంద్రన్ కెమెరా పనితనం ఒక లెవెల్లో ఉంది. కేరళ గ్రామీణ అందాలను బాగా ఎక్స్ ప్లోర్ చేశారు. సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ విలువలు బాగున్నాయి. లావిష్ గా తీశారు. ఎడిటింగ్ తో సహా అన్ని విభాగాలు పనితనం గొప్పగా ఉంది. మాస్ ను ఇంతగా ఆకట్టుకునే సినిమా ఈ మధ్య కాలం లో ఇదే. నటీనటుల ప్రతిభ, సాంకేతిక నిపుణుల పనితనం ఈ సినిమాను గొప్పగా తీర్చిదిద్దాయి.
మాతృక నుంచి కొంత దూరంగా జరిగినా ఈ సినిమా ఇంత జనరంజికంగా వచ్చిందంటే, దానికి కారణం మాటల మాత్రికుడు త్రివిక్రమ్ చూపిన ప్రతిభ యే కారణం .
.. రాజేంద్రప్రసాద్ రెడ్డి
Discussion about this post