తిరుపతి నగరం లో సి జి హెచ్ ఎస్ వెల్ నెస్ సెంటర్ కేంద్ర ప్రభుత్వం తక్షణం ఏర్పాటు చేయాలని ఎం పి మద్దిల గురుమూర్తి లోక్ సభలో మాట్లాడారు. తిరుపతి నగరం లో అనేక కి కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి అని, వీటిలో 15 000 కు పై గా ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు.
అలాగే పొరుగున ఉన్న అనంతపురం, కడప,కర్నూలు జిల్లాలో కూడా వేలాదిమంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. వీరందరికీ ఆరోగ్య సమస్యలు వస్తే స్థానికంగా కేంద్ర ప్రభుత్వ వైద్య సదుపాయాలు లేవన్నారు.
ఎన్నో సంవత్సరాలు గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు సి జి హెచ్ ఎస్ వెల్ నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, తక్షణం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి నగరం లో సి జి హెచ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ను కోరారు.
వ్యసనాల నుంచి విముక్తికి కేంద్రం ఉండాలి
మత్తుమందుల (డ్రగ్స్,) సేవనం వ్యసనంగా మార్చుకున్న వ్యక్తుల ను ప్రాణాంతక మత్హు పదార్థాల సేవనం నుంచి విముక్తి చేసి ఆరోగ్యవంతులు గా మార్చేందుకు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రల్లో మరిన్ని పునరావాస,చికిత్స కేంద్రాల సంఖ్య ను తక్షణం పెంచాలని తిరుపతి ఎం పి మద్దిల గురుమూర్తి లోక్ సభ వేదిక గా విజ్ఞపి చేశారు.
డ్రగ్స్ నిరోధక చట్ట సవరణ పై మాట్లాడుతూ దేశంలో క్రమేణా గంజాయి, కొకైన్, హెరాయిన్ , పొగాకు,గుట్కా వంటి ప్రాణాంతక మత్హు పదార్థాలు సేవించే వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తున్నదన్నారు.
ఎం పి 2019-19 సంవత్సరం అధికారిక లెక్కలు ప్రకారం 31 మిలియన్ ల మంది గంజాయి, 30 మిలియన్ల మంది ఇతర డ్రగ్స్ సేవిస్తున్నారన్నారు. 20 మిలియన్ ల మంది ఓపియం, హెరాయిన్ వంటి మత్హు పదార్థాలకు ముఖ్యంగా యువత బానిసలుగా మారి అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నారు అని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల ల్లో మత్తు పదార్థాలు ఉత్పత్తి చేసేవారు,సప్లయిర్స్, విక్రయాలు చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కోరారు.
ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా, అమ్మకాలను నిరోధించడానికి స్పెషల్ ఎన్ఫోర్చ్ మెంట్ బ్యూరో ఏర్పాటు చేసిందని తెలిపారు. నార్కోటిక్స్ బ్యూరో, పక్క రాష్టాల పోలీసుల తో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా డ్రగ్స్ మహమ్మారి ని అరికట్టేందుకు పనిచేస్తున్నారన్నారు.
డ్రగ్స్ సేవనం వంటి చేడు అలవాట్లు ఉంచి యువత ను దూరంగా ఉంచేందుకు మద్య విమోచన కమిటి ని ఏర్పాటు చేసి వారి ద్వారా పెద్ద ఎత్తున అవగాహన ప్రచార కార్యక్రమాలు జగన్ చేపట్టారన్నారు. ఈ తరహా మాదకద్రవ్యాలు సేవన వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు దేశంలో ని సెలెబ్రిటీ లు, ప్రజాప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన వారందరు భాగస్వాములు కావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మాదకద్రవ్యాలు రవాణా, అమ్మకాలు నిరోధించడానికి గట్టిగా కృషి చేస్తున్నదని మద్దిల గురుమూర్తి అభినందించారు.
.
Discussion about this post