ఒకప్పటి తెలుగుదేశం నాయకుడు, గత చంద్రబాబు హయాంలో కాపు ఎజెండాతో.. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన ముఖ్యమంత్రి జగన్ కు ఒక చిత్రమైన లేఖ రాశారు. అందులో ఒక ఫోటో పెట్టి.. మూడే లైన్లు రాశారు.
గతంలో ఎన్నటిదో ఒక పాత ఫోటో అది. బీజేపీ నేత అద్వానీ, తెలుగుదేశం నేత అశోక్ గజపతి రాజు కలిసినప్పటి ఫోటో. ఆ ఫోటోలో వారిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు.
‘‘ఈ ఉత్తరంలో విజయనగరం మహారాజా వారి కుమారులు గౌరవ అశోక్ గజపతి రాజు గారిని బిజెపి అగ్ర నాయకులు గౌరవ అద్వానీ గారు ఎలా గౌరవించారో చూడడం కోసం ఆ ఫోటోను తమరికి పంపినాను. ఇక పంపనండి. నిర్ణయం తమరిదేనండి.’’
అని మాత్రమే లేఖలో రాశారు. కానీ అశోక్ గజపతి రాజు పట్ల ప్రభుత్వం వ్యవహార సరళిపై తీవ్ర విమర్శలాగా ఆ లేఖ ఉండడం విశేషం.
ఈ లేఖ ఓసారి చూడండి..

.