పుత్తూరులోని ఏఐఎస్ఎఫ్ నగరి నియోజవర్గం సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసిన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల ఆక్రమణ కోసమే విలీన నాటకమాడుతుందని విమర్శించారు.
జీవోలు 42, 50, 51 లను రద్దు చేయకుండా ఆప్షన్స్ పేరుతో మోసం చేస్తుందన్నారు. జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్‌ను కొనసాగిస్తున్నట్లు కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ రద్దు వల్ల విద్యార్ధులపై ఫీజుల భారం పెరుగుతుందన్నారు.
జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎయిడెడ్‌ను కొనసాగిస్తున్నట్లు జీవో జారీ చేయాలన్నారు. విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చడం కోసమే ప్రభత్వం ఆప్షన్స్ భ్రమలు కల్పిస్తుందని దుయ్యబట్టారు.
యాజమాన్యాలు ప్రైవేట్ గా కొనసాగించుకోవచ్చు అంటూనే అవి కోరితే సిబ్బందిని తిరిగి ఇచ్చేస్తామంటూ పక్కదారి పట్టిస్తుందన్నారు. ప్రభుత్వం ఎయిడెడ్ ను కొనసాగిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సమావేశంలో నగరి నియోజవర్గ ఏఐఎస్ఎఫ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్, మణికంఠ, కుమరేష్, గూగుల్ భాను ప్రకాష్, గౌతమ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
.