భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సత్రవాడ, తెరని, నగరి మండపం, నగరి పట్టణములలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,
ఈ సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి.గోవింద స్వామి మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ కృషి లేనిదే బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమయ్యేది కాదని కొనియాడారు.
నిస్వార్థంగా అట్టడగు వర్గాల విముక్తికి ఆయన సేవలు ఎనలేనిదని, వారు భౌతికంగా దూరమైన వారు రచించిన రాజ్యాంగము ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల సంక్షేమాలుకు దోహద పడిందని అన్నారు.
ప్రపంచంలోనే 100% ప్రజాస్వామ్య విలువలు,సమానత్వం కలిగిన ఒక రాజ్యాంగం ఉందంటే అది భారత రాజ్యాంగం మాత్రమే అనే విషయాన్ని యావత్తు భారత దేశ ప్రజానీకం ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో అనుభవిస్తున్నదన్నారు.
అలాంటి కారణ జన్ముడు. డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్ గారికి నివాళులర్పించడం లో తాము రుణపడి ఉండామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిన్నబ్బ,బాలవర్ధన్ రాజు, తంగరాజు,సందీప్,ఎయిల్,తమిళ్,దన,గజేంద్ర,రాము,మీరా,బాలాజీ,అల్లి ముత్తు,అడ్వకేట్.బాబు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
.