జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం క్రింద లబ్ధిదారులకు రుణ విముక్తి ధృవీకరణ పత్రాలను వరదయ్యపాలెం ఎంపీడీవో సుబ్రమణ్య రాజు సోమవారం పంపిణి చేశారు.
ఈసందర్భంగా వరదయ్యపాలెంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని గురించి హౌసింగ్ ఏఈ సుధాకర్ మాట్లాడారు. వరదయ్యపాలెం పంచాయతీ లో గతంలో పక్క ఇళ్లు పొందిన లబ్దిదారులు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద పదివేలు రూపాయలు చెల్లించినయడల పూర్తిస్థాయి రుణమాఫీతో పాటు ఇళ్లు-స్థలానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుస్నట్లు తెలిపారు.
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా వరదయ్యపాలెం పంచాయతీ బజారు వీధి కు చెందిన జయంతి అనే లబ్దిదారునికి రుణ విముక్తి దృవీకరణ పత్రాని అందచేశారు.
ఈ కార్యక్రమంలోవరదయ్యపాలెం సర్పంచ్ పి జ్యోతి పంచాయతీ కార్యదర్శిహబీబ్ , ఇంజనీరింగ్ అసిస్టెంట్ మన్యం తరుణ్ , వెల్ఫైరే అసిస్టెంట్ భాను, డిజిటల్ అసిస్టెంట్ తుమ్మ విజయ్ శంకర్ సర్వేయర్ అట్లూరు భారత్ విఆర్వో నాగేంద్ర బిల్ కలెక్టర్ ఈశ్వరయ్య మరియు వాలంటీర్స్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.
.

Discussion about this post