ఆదిశంకరాచార్యుని జయంతిని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చాలా ఘనంగా నిర్వహిస్తోంది. దేశంలోని దాదాపు అన్ని ఆలయాలలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదిశంకరుని జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ.. లలాటం నిండుగా అడ్డనామాలు ధరించి కేదార్ నాధ్ లో ఆదిశంకరాచార్యుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కేదార్ నాధ్ ఇటీవలి విపత్తుల తాకిడికి ధ్వంసమైన ఆదిశంకరుని మహాసమాధిని పునర్నిర్మించారు. కేదారపురిలో మొత్తం 130 కోట్ల రూపాయలకు పైబడిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన నరేంద్రమోడీ.. కేదార్ నాధ్ ఆలయంలో కూడా ప్రత్యేకపూజలు చేశారు.
దేవభూమి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మోదీ ప్రత్యేకపూజలు నిర్వహించారు.
ఆలయ సందర్శన అనంతరం ఆది శంకరాచార్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఆదిశంకరుని విగ్రహం సమక్షంలో కూర్చుని మోడీ ధ్యానం చేశారు.
కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుల సమాధి, విగ్రహంతోపాటు సరస్వతి ఘాట్, 130 కోట్ల ఇన్ ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పాల్గొన్నారు.
ప్రధాని కేదార్‌నాథ్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం దేశవ్యాప్తంగా సాంస్కృతిక పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.

EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
.