ఈ పోలీసుల సాహసాన్ని శెభాష్ అని తీరాల్సిందే! కడపజిల్లా పోరుమామిళ్ల పోలీసులు ఐదుగురు మహిళల ప్రాణాలు కాపాడారు. పోరుమామిళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో రేపల్లె వాగు ఉధృతికి కాజ్ వే మీద నీటి ప్రవాహంలో 5 మంది మహిళలు చిక్కుకుపోయారు. సమీపంలో ఉన్న కొట్టాల పల్లి గ్రామం నుంచి పనిపై గానుగపెంటకు వచ్చిన మహిళలు తిరుగు ప్రాయణంలో ఇక్కడ ఇరుక్కుపోయారు. మొదట్లో ప్రవాహం తక్కువ ఉండటంతో సులువుగా గ్రామం నుండి వారు గానుకగపెంటకు చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో కొద్దీ దూరం దూరం వచ్చి ప్రవాహ ఉదృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో వారంతా కాజ్ వే మీద ఒకేచోట నిలిచిపోయి రక్షించాలంటూ పెద్ద ఎత్తున కేకలు వేశారు. పోరుమామిళ్ల నుండి చెరువులు, వాగులు, నదుల ప్రమాదకర స్థితిని తెలుసుకునే విధుల్లో తిరుగుతున్న పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, కానిస్టేబుల్ ఓబులేసు వెంటనే స్పందించి వారి చెంతకు వచ్చారు.
మహిళల కేకలు విని హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య, ఓబులేసు, వంతెన మధ్యకు వెళ్లి బాధిత మహిళలను ఒడ్డుకు తీసుకువచ్చారు. సాహసించి, ఐదుగురు మహిళల ప్రాణాలను కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ అభినందించారు.
.