తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా హోసూరులో విలగం తమిళ వార్తాపత్రిక విలేకరి జి.నాగరాజు(47) దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఆరుగురు దుండగులు నాగరాజును అడ్డుకుని వేట కొడవళ్ళతో నరికి చంపినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. హోసూరు కుప్పం సరిహద్దులోని తమిళనాడు ప్రాంతంలో ఉండే ఊరు కావడం విశేషం. హోసూరులో జరిగిన జర్నలిస్టు హత్య.. సరిహద్దుల్లోని తెలుగు ప్రాంతంలో కూడా సంచలనం సృష్టిస్తోంది.
హోసూరులో విలేకరి నాగరాజు దారుణ హత్యకు గురయ్యారు. హోసూరు పరిసరాల్లో విచ్చలవిడిగా సాగుతున్న రియల్ ఎస్టేట్ దందాపై నాగరాజు.తను విలేకరిగా పనిచేస్తున్న తమిళ పత్రికలో వరుస కథనాలు రాశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కావాలంటూ మూడు నెలల క్రితమే నాగరాజు పోలీసులను కోరారు. అయితే పోలీసులు పట్టించుకోలేదని సమాచారం.
దారుణ హత్యకు గురైన నాగరాజ్‌కు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు స్వస్థలం చిత్తూరు జిల్లా, రామకుప్పం మండలం పాలరేవు గడ్డ గ్రామం. దాంతో కుప్పం నియోజకవర్గ పరిధిలో కూడా నాగరాజు హత్య ప్రకంపనలు సృష్టిస్తోంది. హంతకులను అరెస్టు చేయడానికి కృష్ణగిరి జిల్లా ఎస్పీ పాండి గంగాధర్ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
నాగరాజు హత్యను అటు తమిళనాడుతో పాటు, చిత్తూరు జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు కూడా ఖండిస్తున్నాయి.
ఇవీ చదవండి : కేసీఆర్ గారూ.. ఇందులో కిక్ ఏం ఉంటుంది సార్ అన్ని వివరాలూ లాగారు .. ఇక పిలవడమే నాగ్ - అఖిల్ కాంబోలో సెకండ్ మూవీ కుప్పం సమీపంలో జర్నలిస్టు దారుణ హత్య
.

Discussion about this post