మొదటి మూవీ ఇంకా సెట్స్ మీదకు కూడా వెళ్లలేదు. అప్పుడే రెండో మూవీనా? అని ఆశ్చర్యపోవద్దు. మీకు అలా అనిపిస్తే.. దీనినే మొదటి మూవీగా కూడా భావించొచ్చు. కానీ ఇంతకూ సంగతేంటంటే.. అక్కినేని కుటుంబం నుంచి తండ్రీ కొడుకులు కలిసి చిత్రం చేయబోతున్నారు.
నాగార్జున- నాగచైతన్య కాంబినేషన్ సంగతి ఓకే గానీ.. నాగార్జున- అఖిల్ కాంబినేషన్ కోరుకునే అభిమానుల ముచ్చట ఇంకా తీరలేదు. ఏదో గెస్టులుగా కనిపించడం తప్ప ఇద్దరూ కలిసి ఫుల్ లెంగ్త్ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అలాంటి కాంబినేషన్ ఇప్పుడు కుదిరింది.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక మూవీ ప్లాన్ చేశారు. ఒక రకంగా చూసినప్పుడు ఈ పాటికే అది పట్టాలు ఎక్కి ఉండాలి. కానీ ఈలోగా దర్శకుడు మరో మూవీ ఒప్పుకున్నారు. ఆ షూటింగ్ జరుగుతోంది. దీంతో నాగ్ ఫ్యామిలీ దాన్ని వెనక్కు నెట్టింది. మరో యువదర్శకుడి దర్శకత్వంలో వీరిద్దరి కాంబినేషన్ ముందుగా రాబోతోంది. ఇటీవలి కాలంలోనే మంచి అనూహ్య, సంచలన విజయం సాధంచిన దర్శకుడితోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.
.

Discussion about this post