నిండ్ర మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
నియోజకవర్గం లోని ప్రతి పంచాయతీలో మెగా వైద్య శిబిరం నిర్వహించి అక్కడున్న ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచడానికి తనవంతు సాయంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపినారు
ఈ శిబిరం లో చిన్న జబ్బులకు అక్కడే వైద్యం చేసి మందులు ఇవ్వటం, ఒక వేళ సర్జరీ అవసరమైతే అది కూడా ఉచితం గా చేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎమ్మేల్యే ఒక డాక్టరుగా, ఒక ప్రజా నాయకురాలిగా గ్రామ ప్రజల యొక్క ఆరోగ్యానికి కోసం వారి మంచి వైద్య సౌకర్యం అందించడానికి సంకల్పించారు.
దీనిని మా గ్రామస్థులంతా గుర్తు పెట్టుకొని ఎప్పటికీ ఋణపడి వుంటామని తెలిపారు.
Discussion about this post