తిరుపతిలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంకల్స సేవా సమితికి ఆదివారం ప్రశంసాపత్రం అందజేశారు. సంస్థ నిర్వాహకులు రాజారెడ్డి ఈ ప్రశంసాపత్రం అందుకున్నారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యునివర్సిటీ లో రెండు రోజులు పాటు సవేరి మీటింగ్ హాల్ లో సాయి రాధా కృష్ణా ఎడ్యుకేషనల్ సొసైటీ, నేషనల్ మెడిసినల్ ప్లాంట్ బోర్డ్ ల ఆధ్వర్యంలో గ్రామీణ రైతుల ఆర్థికాభివృది.. ఔషధ మొక్కల సాగు, సంరక్షణ అనే అంశం పై జా తీయ సద స్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు ముఖ్య అథితిగా నేషనల్ బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మురుగేషన్ హాజరయ్యారు. ఈ సదస్సులో ఔషధ మొక్కల సంపదను వ్యవసాయ రంగంలో అనుసంధానం చేయడం వలన రైతుల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే క్షేత్ర స్థాయిలో రైతులకు, ప్రజలకు మొక్కలపై కనీస పరిజ్ఞానం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్య క్రమంలో పాల్గొన్న సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్. రాజారెడ్డికి నేషనల్ మెడిసినల్ ప్లాంట్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మురుగేషన్ ప్రశంసా పత్రం అందజేశారు.
ఈ కార్య క్రమంలో కార్య క్రమ నిర్వాహకులు డాక్ట సుబ్రమణ్యం, రీడో ఈశ్వరయ్య, రవి, డాక్టర్ జి. మురళీ తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post