చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలోని అపోలో పరిశ్రమ యాజమాన్యం భారీ వర్షాలు కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్న పేదల పట్ల ఔదార్యాన్ని ఛాటుకుంది. పేదలకు ఆహారాన్ని అందించింది.
చిన్నపాండూరు ఉప సర్ఫంచ్ దేవేళ్ళ మహేంద్ర ఆధ్వర్యంలో అపోలో పరిశ్రమ యాజమాన్యం ద్వారా నక్కలమిట్ట, వికెఆర్ కాలనీ గిరిజన కాలనీల్లో రెండు రోజుల పాటు ఆహరం అందించేందుకు ముందుకు వచ్చారు.
ఉపసర్ఫంచ్ మహేంద్ర పేదలకు ఆహారం ను పంపిణీ చేస్తున్నారు.
పేదల ఆకలిని తీర్చేందుకు ముందుకువచ్చి సాయం అందించిన అఫోలో పరిశ్రమ యాజమాన్యంకు గ్రామస్తులు కృతఙ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమంలో విఆర్ఓ నల్లయ్య, పాస్టర్ రమేష్ ,గ్రామస్తులు పాల్గొన్నారు.
.