చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రశిక్షణా తరగతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లడుతూ ఈ తరగతులు మూడు రోజుల పాటు జరగుతాయని చెప్పారు.
ఈ అవకాశాన్ని బీజేపీ కార్యకర్తలు వినియోగించుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో భాను ప్రకాష్ రెడ్డి. నీలకంఠం, సురేష్ రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, తిరుపతి పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కిసాన్ మోర్చా ఇంఛార్జి చంద్రప్ప, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, మహిళా మోర్చా నాయకురాలు శైలజ, ప్రజ్ఞశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పార్టీ సిద్ధాంతాల పట్ల, ప్రజా సమస్యలను తెలుసుకోవడం, వాటిని పరిష్కారానికి చేయవలసిన కృషి పట్ల, నాయకత్వ బాధ్యతల పట్ల, కేంద్ర ప్రభుత్వ పథకాలను చిట్ట చివరి ప్రజలకు చేరవేయడం వంటి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
.