ప్రపంచ స్థాయి అభివృద్ధిని వీక్షించేందుకు ప్రతి ఒక్కరూ శ్రీసిటీని సందర్శించాలంటూ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సిఫార్సు చేశారు.
మంగళవారం చెన్నైలో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఒలివర్ బాల్‌హట్‌చెట్ (ఎంబిఈ) ఏర్పాటు చేసిన UK బిజినెస్ క్రిస్మస్ డిన్నర్ రిసెప్షన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ కు చెందిన పరిశ్రమల సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మరియు శ్రీసిటీలోని యుకె పరిశ్రమల సీనియర్ అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఆండ్రూ తన శ్రీసిటీ పర్యటనను గుర్తుచేసుకుంటూ, వాస్తవానికి శ్రీసిటీని చూడటం చాలా సంతృప్తికరమైన అనుభవాలలో ఒకటని పేర్కొన్నారు. శ్రీసిటీ వ్యాపార సామర్థ్యాన్ని పరిశీలించడానికి ఒకసారి తప్పక సందర్శించాలని పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు పిలుపునిస్తూ, మరిన్ని యుకె కంపెనీలు తమ కార్యకలాపాలకు శ్రీసిటీని ఎంచుకుంటాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి శ్రీసిటీ గురించి క్లుప్తంగా ప్రెజంటేషన్ ఇచ్చారు. శ్రీసిటీలో వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించే లొకేషన్ అనుకూలతలు, ఇతర ప్రత్యేకతలను హైలైట్ చేశారు. శ్రీసిటీ గురించి తెలుసుకోవడంలో డా. ఆండ్రూ ఫ్లెమింగ్, ఇతరులు చూపిన శ్రద్ధను తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు. వారి పరిశీలనలు, ప్రోత్సాహం మరిన్ని యుకె వ్యాపార పెట్టుబడులకు మార్గం సుగమం చేస్తాయని చెప్పారు.
.
Discussion about this post