దేశ భద్రత కోసం అహర్నిశలు కష్టపడి , దేశానికి ఎన్నో సేవలు అందించిన భారతదేశ డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ అకాలమరణం ఎంతో బాధాకరం అని వరదయ్య పాళెం మండల అంబేద్కర్ సంఘం చైర్మేన్ చిన్నా అన్నారు.
అదే హెలికాప్టర్ ప్రమాదంలో మన ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడ ప్రాంతానికి చెందిన జవాన్ సాయితేజ కూడా మరణించడం దుఃఖదాయకం అని పేర్కొన్నారు.
ఆ ప్రమాదంలో మరణించిన వారందరి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వరదయ్యపాళెం లో అంబేద్కర్ మండల సంఘం నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో తడ శీను,వెంకటేష్,ఎస్బిఐ వెంకటేష్,గంగాధరం,సత్యానంద్ లు పాల్గోన్నారు.
.

Discussion about this post