తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులు 14రోజులుగా శాంతి యుతంగా చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని టీటీడీ యాజమాన్యం , రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రపంచ మానవ హక్కుల దినమైన ఈ రోజు మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా ఈరోజునే అక్రమ అరెస్టులు చేయడం దారుణంఅని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, సత్యవేడు నియోజకవర్గ ఇంఛార్జి దాసరి జనార్దన్ విమర్శించారు.
టిటిడి కార్మికులకు మద్దతుగా ఉన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి , సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, యూనియన్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, డి వై యఫ్ ఐ ,మహిళా సంఘాల జిల్లా కార్యాదర్సులను ఇళ్ల వద్దనే హౌస్ అరెస్ట్ చేయడం దారుణం అన్నారు.
ఈ అరెస్టులను ప్రజాతంత్ర వాదులు ఖండించాలని కోరారు.
కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో తెలిపిన టిటిడి వర్కర్స్ యూనియన్ నాయకులైన నాగార్జున, వెంకటేష్ గుణశేఖర్ లను అకారణంగా సస్పెండ్ చేయడం టీటీడీ యాజమాన్యం కర్కశత్వానికి నిదర్శనమన్నారు.
అక్రమ సస్పెన్షన్ ఎత్తివేసి వారిని విధుల్లోకి తీసుకుని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .
ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా అంతా నిరసనలకు దిగుతామని హెచ్చరించారు.
.

Discussion about this post