శారీరక దారుఢ్యానికి జిమ్ చక్కటి వ్యాయామంగా నిలుస్తుందని చిత్తూరు జిల్లా సత్యవేడు సింగిల్విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆదివారం రాత్రి లియో జిమ్ వార్షికోత్సవ వేడుకలు సత్యవేడులో ఘనంగా జరిగాయి.
ముఖ్య అతిథులుగా ఎస్సై వీరాంజనేయులు ,గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ హాజరయ్యారు .ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా నేటి తరం యువతకు జిమ్ వ్యాయామము ముఖ్యమన్నారు . దీనివల్ల యువత చెడు వ్యసనాల బారిన పడకుండా చూడొచ్చు అన్నారు .
దీంతోపాటు ప్రతిరోజు జిమ్ కేంద్రానికి వెళ్లి పలు రకాల వ్యాయామాలు చేయడంవల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు .పని ఒత్తిడులు ఎంత ఉన్న నిత్య జీవన విధానంలో భాగంగా ప్రతిరోజు గంట పాటు జిమ్ వ్యాయామంలో శిక్షణ తీసుకోవడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఆయన గుర్తు చేశారు .
సత్యవేడులో గత తొమ్మిది సంవత్సరాలుగా తక్కువ ఖర్చుతో జిమ్ సేవలను అందిస్తున్న లియో జిమ్ నిర్వాహకులకు ఆయన అభినందనలు తెలిపారు.
అంతకుమునుపు రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ పోటీలలో 23 సార్లు విజేతగా నిలిచిన మిస్టర్ ఆంధ్ర శివాజీ పర్యవేక్షణలో యూత్కు బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు . ఈ పోటీలలో 10 మంది పాల్గొనగా ఇందులో ఓవర్ షాపింగ్ షిప్ ప్రథమ విజేత జగదీష్ నిలిచారు. విజేత జగదీష్ కు సింగిల్విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి ,ఎస్సై వీరాంజనేయులు బహుమతులు ప్రధానం చేశారు.
కాగా శారీరక బరువు తగ్గడం ,పెరగడం వంటి పలు రకాల వ్యాయామాల కోసం వివిధ రకాల ఆధునిక పరికరాలు యువతకు అందుబాటులో ఉన్నట్టు స్థానిక లియో జిమ్ నిర్వాహకుడు కరిఅరసు చెప్పారు . ప్రస్తుతం తమ కేంద్రంలో దాదాపు అరవై మంది జిమ్ కేంద్రానికి వస్తున్నట్లు పేర్కొన్నారు.
పురుషులతో పాటు పిల్లలు మహిళలకు కూడా వారికి తగ్గట్టు వ్యాయామం చేసుకోవడానికి ఆధునిక పరికరాలు ఉన్నట్టు స్పష్టం చేశారు .దీంతోపాటు ఆసక్తి యువతకు బాడీ బిల్డింగ్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు .వీరిని తదుపరి జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగే బాడీ బిల్డింగ్ పోటీల్లో పంపించడం జరుగుతుందన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దాతల సహాయ సహకారాలతో లియో జిమ్ము కేంద్రంలోని రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడానికి సన్నాహక చేస్తున్నట్టు ఆయన చెప్పారు. లియో జిమ్ సేవలను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ నాయకుడు కోళ్ల చిన్న , పలువురు యువకులు తదితరులు పాల్గొన్నారు.
.