వివిధ కేసుల్లో సత్వర న్యాయానికి చక్కటి పరిష్కార వేదిక జాతీయ లోక్ అదాలత్ మాత్రమేనని చిత్తూరు జిల్లా సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా చెప్పారు.
2021 డిసెంబర్ 11వ తేదీ స్థానిక కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందన్నారు .దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సివిల్ ,క్రిమినల్ ,కాంపౌండ్బుల్ కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ చక్కటి అవకాశం అన్నారు.
తద్వారా కచ్చిదారులు ఇరువర్గాలు విజయ పొందడానికి వీలవుతుందన్నారు .పైగా ఈ కోర్టు పరిధిలో ఉన్న బ్యాంకు ,బిఎస్ఎన్ఎల్ , రెవిన్యూ ,విద్యుత్ శాఖ సంబంధించిన కేసులు కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.
అప్పీలు లేని అంతిమ విజయం లోక్ అదాలత్ ద్వారా సాధ్యపడుతుంది అని చెప్పారు .రాజమార్గం కోసం ఎదురు చూసే కక్షిదారులకు ఇది ఒక సువర్ణవకాశంగా ఉంటుందన్నారు.
సమయం ,డబ్బు వృధా కాకుండా కచ్చి దారులు కూడా వారి కేసులను పరిష్కరించుకోవడానికి రాజీ మార్గాన్ని ఎంచుకోవాలని ఆమె కోరారు.
ఈనెల డిసెంబర్ 11వ తేదీన స్థానిక జూనియర్ కోర్టు ప్రాంగణంలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు ,బ్యాంకర్లు ,పోలీసులు ,రెవెన్యూ విద్యుత్ శాఖ ,బిఎస్ఎన్ఎల్ ,న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా సత్యవేడు జూనియర్ సివిల్ జడ్జి షేక్ ఆరిఫా కోరారు .
.
Discussion about this post