18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని సత్యవేడు నియోజకవర్గ స్థాయి ఓటర్ల సంక్షిప్త సవరణ జాబితా తయారు చేసే అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు యువతీ యువకులు తక్షణం ఓటు హక్కు కోసం ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.
ప్రత్యేక నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో సుమారు 539 మంది కొత్తగా ఓటు హక్కు కోసం ధరఖాస్తులు
చేసుకున్నారన్నారు. అధేవిధంగా ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితా లో మరణించిన వారు ,ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు, జాబితా నుంచి పేర్లు తొలగింపుకు సుమారు 418 ధరఖాస్తులు అందాయన్నారు. పేర్ల దిద్దుబాటుకు గాను 63 ధరఖాస్తులు చేరాయన్నారు. ఇవన్నీ ప్రత్యేక నమోదు కార్యక్రమాలు ద్వారా వచ్చిన ధరఖాస్తులుగా ఆయన వివరించారు.
“వాడ”లో మిశ్రమ స్ఫందన
ఓటర్ల నమోదు కార్యక్రమాలకు శ్రీసిటి పరిధిలోని పలు గ్రామాల్లో మంచి స్పందన వచ్చిందని వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రధానంగా చెరివి, మల్లవారిపాళెం ఈస్ట్ , తొండూరు ఆరూరు తదితర గ్రామాల్లో ఓటు నమోదుకు సంబంధించి మంచి స్పందన ఉందన్నారు.ఇంకా మరికొన్ని ధరఖాస్తులు వస్తాయన్నారు. ఇక్కడ కొత్తగా ఓటు హక్కు కొరకు 73 ధరఖాస్తులు గరిష్టంగా వచ్చాయన్నారు. ఇంకా మరికొన్ని ధరఖాస్తులు ఆయా పంచాయితీల నుంచి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలియజేశారు.
సత్యవేడు తహాశీల్ధార్ శ్రీదేవి, శ్రీసిటీ ప్రతినిధులు,రెవిన్యూ క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా గ్రామాల్లో ఈ కార్యక్రమంపై మంచి అవగాహన కల్పించడం వల్ల మిశ్రమ ఫలితాలు వస్తున్నాయనీ ఆయన తెలిపారు.
.