వైఎస్ షర్మిల ఇప్పుడు వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. కేసీఆర్ మీద నిప్పులు చెరుగుతున్నారు. ప్రతి మంగళవారం దీక్షలు చేస్తున్నారు. ఇలా ఏదో తనకు తోచిన రీతిలో పోరాటాలు చేసుకుంటూ పోతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా, కేసీఆర్ ఢిల్లీ టూర్ మీద షర్మిల ఫైర్ అయ్యారు. మోడీ మీద విమర్శలు చేసిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి సాధించిందేమీ లేదన్నారు. అయితే ఢిల్లీ టూర్లో ఏమీ సాధించకపోవడం అనేది.. ఏపీ ముఖ్యమంత్రి, షర్మిల సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి విషయంలో అనేక మార్లు జరిగింది. అయితే ఎన్నడూ ఒక్కసారైనా అన్నయ్యను అడగలేదేం చెల్లెమ్మా అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ టూర్ మీద షర్మిల తాజాగా ఒక ట్వీట్ చేశారు.
3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన KCR కథ 3ఏండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయింది. ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్ లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు. అపాయింట్ మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు?
ఇదీ చదవండి : ఎమ్మెల్యే చేతగానితనం.. షర్మిల మామయ్యకు సెగ తప్పలేదు
ఒక పక్క రైతులు కల్లాల్లో ధాన్యం పెట్టుకొని, వర్షానికి తడుస్తూ గుండెలు చెరువై కుప్పలపైనే ప్రాణాలు విడుస్తుంటే, మీ హుజురాబాద్ ఓటమిని జనాలు మర్చిపోవాలని, వరి కిరికిరి అని ధర్నా డ్రామాలతో ఢిల్లీ తీర్థ యాత్రలకు పోయింది చాలు.యాసంగి పక్కన పెట్టి కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనండి.
అనేది ఆ ట్వీట్ లోని ఆమె విమర్శల సారాంశం.
తెలంగాణ నేటివ్ సామెతలను కూడా చక్కగా రాయించుకుంటూ షర్మిల ట్వీట్లు మంచిగానే పెట్టారు గానీ.. ఇదే సంగతి ఆమె ఏనాడూ అన్నయ్యను జగన్ అడగలేదేం అనేది ప్రజల ప్రశ్న.
జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో అపాయింట్మెంట్ లేకుండానే ఢిల్లీ వెళ్లి రోజుల తరబడి అక్కడ నిరీక్షించి.. ప్రధాని కాదు కదా.. కనీసం అమిత్ షా అపాయింట్మెంట్ కూడా దొరక్కుండానే తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అవి అన్నీ ఆయన వైఫల్యాలే. అయితే ఏనాడూ షర్మిల ప్రశ్నించలేదు.
నిజానికి షర్మిల 2019 ఎన్నికలలో చాలా ముమ్మరంగా ప్రచారం చేశారు. తనే పార్టీకి అసలు నాయకురాలు అన్నట్టుగా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ప్రజలకు అన్ని మాటలు చెప్పి అన్నను అధికారంలోకి తీసుకువచ్చినప్పుడు.. అదే ప్రజల తరఫున అన్నను ప్రశ్నించే బాధ్యత ఆమెకు ఉండదా? లేదా, ఏపీ ప్రజలను ఎన్నికల తర్వాత గాలికొదిలేసిందా? అనేది ప్రజల సందేహం.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
2019 ప్రచారంలో అన్ని మాటలు చెప్పి.. అంత సునాయాసంగా ఏపీ ప్రజలను గాలికి వదిలేయడమే నిజమైతే గనుక.. అది షర్మిల అలవాటు అనుకోవాలి. ఇప్పుడు ఆమె తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇస్తున్నారు. ఈ మాట మీద మాత్రం నిలబడుతుందని ప్రజలు ఎలా నమ్మాలి? ఇదేదో టైంపాస్ కోసం చెబుతున్న మాటలు అని ఎందుకు అనుకోకూడదు అనేది ప్రజల సందేహం.
ఇది కూడా చదవండి :
జగన్ మడమ తిప్పని నేత అంటారు గానీ.. మాట మార్చేసే నేత
మోడీ, చంద్రబాబు.. ‘ఈ జన్మలో చూడలేం’ అనుకున్నది చూపించారు
చట్టాలు తయారు చేసే స్థానంలో ఉంటూ బండబూతులు తిట్టుకునే సిగ్గుమాలిన రాజకీయం
‘‘అపాయింట్ మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు?’’ అని కేసీఆర్ ను అనేముందు.. అన్నయ్య కూడా అదే పని అనేకసార్లు చేశాడు.. ఆయనకు ఈ ప్రశ్న అనేకరెట్లుగా వర్తిస్తుందనే సంగతి ఆమెకు గుర్తుకురాలేదా అని జనం నవ్వుకుంటున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆమె వేలుపెట్టకపోతే పాయె.. కానీ.. అక్కడి అన్నయ్య వైఫల్యాలను వేలెత్తి చూపకుండా.. తెలంగాణ రాజకీయాలు మాత్రం మాట్లాడడం అవకాశవాద వైఖరి అనే విమర్శలూ వస్తున్నాయి.
3గంటల దీక్ష చేసి ఢిల్లీకి పోయి తాడోపేడో తేల్చుకుంటానని చెప్పిన KCR కథ
3ఏండ్లు కర్రసాము నేర్చి మూలకున్న ముసల్దాన్ని కూడా కొట్టలేని తీరు అయింది.
ఢిల్లీకి పోయి పొడుస్తమ్ అని ప్రెస్ మీట్ లు పెట్టిన దొర ఉత్తి చేతులతో తిరిగొచ్చాడు.
అపాయింట్ మెంట్ లేకుండానే ఏం పొడుస్తారని పోయారు?1/2 pic.twitter.com/9wbE320gdZ— YS Sharmila (@realyssharmila) November 25, 2021
.

Discussion about this post