• About Us
  • Contact Us
  • Our Team
Thursday, July 16, 2026
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper
No Result
View All Result
Adarsini
No Result
View All Result

ఎమ్మెల్యేపై పగ.. జగన్ మామయ్యకు సెగ!

admin by admin
November 25, 2021
0
ఎమ్మెల్యేపై పగ.. జగన్ మామయ్యకు సెగ!

లోకల్‌గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ప్రజల కష్ట నష్టాలని పట్టించుకోవడం లేదని, ఆయన అనుచరులు చేస్తున్న ఆగడాల వలన, కొన్ని దందాల వలన ప్రజల జీవితాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నాయనే అభిప్రాయం కూడా ఉంది. ఆయన మీద వీర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే వరదలు వచ్చి జనజీవితాలు అతలాకుతలం అయ్యాయి. ప్రభుత్వం తరఫున సాయం అందించడానికి సదరు ఎమ్మెల్యేతో సహా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామయ్య కూడా వచ్చారు. ప్రజాగ్రహం మిన్నుముట్టింది. దారుణమైన అవమానంతో ఆయన తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

పృష్ట తాడనాత్ దంత భంగః అని సంస్కృతంలో ఒక సామెత ఉంటుంది. వీపు మీద తంతే మూతిపళ్లు రాలాయనేది ఆ సామెత అర్థం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కూడా అచ్చంగా అలాగే జరిగింది.

ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైఖరి మీద విసిగిపోయి ఉన్న ప్రజలు.. వరద సాయం అందించడానికి సదరు ఎమ్మెల్యేతో పాటు, జగన్ కు మామ.. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కోవూరు మండలంలో పర్యటిచింనప్పుడు గోబ్యాక్ నినాదాలతో పాటు, ప్రజల ఛీత్కారాలను  ఎదుర్కొన్నారు. కనీసం కారు దిగడానికి కూడా ధైర్యం లేక అవమానాన్ని భరిస్తూ తిరిగి వెళ్లిపోయారు.

ఇదంతా కోవూరు నియోజకవర్గం పరిధిలోని బీడీ కాలనీలో పర్యటించారు. అయితే ‘‘అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చారా.. చచ్చామా.. బతికామా చూడ్డానికి వచ్చారా’’ అని ప్రజలు తిరగబడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. సకాలంలో ఆదుకోలేదనే ప్రజలు ఆగ్రహించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

అయితే అసలు కారణం వేరే ఉంది. స్థానికంగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మీద ప్రజల్లో ఆగ్రహం ఉంది. అక్కడ పెన్నానది కరకట్టల్ని ఎమ్మెల్యే అనుచరులు తెగ్గొట్టేశారనే ఆరోపణలున్నాయి. ఇసుక అక్రమ రవాణా కోసం కరకట్టల్ని తెగ్గొట్టారని ఆ ప్రభావం ఇప్పుడు దారుణంగా పడి, కాలనీలు ఘోరంగా మునిగిపోయాయని ప్రజలు కోపంతో ఉన్నారు.

ఎమ్మెల్యే తాలూకు మనుషులు ఇలా కరకట్టల్ని తెగ్గొడుతున్నారని స్వయంగా వెళ్లి ఫిర్యాదులు చేసినప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోలేదనే మంట కూడా వారిలో ఉంది. సరిగ్గా అలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేతో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వచ్చారు. జనం కోపం కట్టలు తెంచుకుంది. నాయకులు కారు దిగే పరిస్థితి కూడా లేకుండా జనం వాహనాల మీదికే ఎగబడడంతో అక్కడినుంచి అంతా వెళ్లిపోయారు. మరో గ్రామానికి వెళ్లి అక్కడ వరదసాయం అందించి.. మమ అనిపించారు. పాపం ఈ నాయకులతో ఉన్నందుకు కలెక్టరు చక్రధర్ కు కూడా ప్రజాగ్రహం తప్పలేదు.

జగన్: మడమ తిప్పని నేతే.. మాట మార్చేస్తాడు!

నడకా.. వ్యాయామమా? తేల్చుకోలేకపోతున్నారా?

నయీం డైరీస్ : ఒక సాహసోపేత ప్రయత్నం!

Tags: balineni in kovurubalineni srinivasa reddyjaganmohan reddykovuru constituencynallapureddy prasanna kumar reddyజగన్ మామయ్య బాలినేనిబాలినేనికి అవమానంమంత్రి బాలినేనికి అవమానంవైసీపీ పై జనాగ్రహం
Subscribe
Login
Notify of
guest
Optional

guest

0 Comments
Oldest
Newest Most Voted

Top Read Stories

28 జూన్ 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

5 జులై 2026 కథానిధి : ఆదివారం కథల సంకలనం

28.6.26 ‘కథానిధి’ సమీక్ష: వర్తమాన సామాజిక వాస్తవికత

5.7.26 ‘కథానిధి’ సమీక్ష: సామాజిక రుగ్మతలపై అక్షరాల తిరుగుబాటు

మూడుముళ్లు బలవంతంగా వేయిస్తారో.. ఏంటో..?

కథానిధి 21.6.26 సమీక్ష: కాలపు గాయాలకు అక్షరాల సాంత్వన

VIDEO

https://www.youtube.com/watch?v=4IsF6u52r8o&autoplay=1&mute=1
Adarsini

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

Navigate Site

  • About Us
  • Contact Us
  • Our Team

Follow Us

No Result
View All Result
  • .
  • Politics
    • Andhrapradesh
    • Telangaana
  • General
  • Edit Page
    • Editorial
    • Dr Govindaraju Chakradhar
    • Beeraka Ravi
    • Dr. S Ramu
    • MV Rami Reddy
    • Suresh Pillai
    • MLN Murty
    • Deviprasad Obbu
    • Others
  • Movies
  • Cine Reviews
  • Photos
  • Videos
  • Special
    • Subhashitham
    • Short Stories
    • Poems
    • Short Films
  • LOCAL
    • Tirumala
    • Chittoor
    • Srikalahasti
    • Tirupati
    • Chandragiri
    • Kuppam
    • Palamaneru
    • Satyavedu
    • Nagari
    • Puthalapattu
    • Tamballapalle
    • Punganuru
  • E-Paper

© 2021 ADARSINI | Designed By 10gminds software solutions

error: adarsini.com Content is protected !!
wpDiscuz
0
0
Would love your thoughts, please comment.x
()
x
| Reply