తెలుగు ప్రజల ఉనికిని చాటిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ద్వంసం చేయడాన్ని తెదేపా సత్యవేడు మండల అధ్యక్షుడు కె ప్రవీణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
సోమవారం విలేకరులతో మాట‌్లాడుతూ దుర్గిలో పట్టపగలు మాజీ ముఖ్యమంత్రి విగ్రహాన్ని సుత్తితో పగలకొట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
సమాజంలో మానవత్వాన్ని చాటిచెప్పడానికి బదులు విద్వేషపాలనను పెంచే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ధ్వజమెత్తారు.
పోలీసు యంత్రాంగం చిత్తశుద్దితో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో రాబోయే కాలంలో ప్రతిగా తెదేపా శ్రేణులు మరొకరి విగ్రహాలను పగలకొట్టడం పెద్దపని కాదని హితవు పలికారు.
.

Discussion about this post