అమరావతి పాదయాత్ర బృందానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలుకుతూ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ మద్దతు తెలియజేశారు.
“న్యాయ స్థానం నుండి – దేవస్థానం వరకు” అనే పేరుతో రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కి వచ్చిన సందర్భంగా సిపిఎం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జగ్గర రాజు పల్లి వద్ద ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్ మాట్లాడుతూ, రాజధాని కొరకు అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాల భూమిని ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే, ఇక్కడ రాజధాని నిర్మించి రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని ఆశించిన రైతుల నోట్లో మట్టి కొట్టింది వైయస్సార్ పార్టీ అని అని విమర్శించారు.
3 రాజధానులు వల్ల రాష్ట్రం అభివృద్ధి కాదని, వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేస్తే, అభివృద్ధి అవుతుంది తప్ప, ఉచితంగా భూములు ఇచ్చిన రైతులు రోడ్ ఎక్కించడం, రైతులను ఇలా రోడ్డుపాలు చేయడం వైఎస్ఆర్ పార్టీకి తగదని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో సీపీఎంపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు హంగేరి పుల్లయ్య, శ్రీకాళహస్తి నాయకులు గంధం మని, కార్యదర్శి పెరగడం గురవయ్య,తొట్టంబేడు మండల కార్యదర్శి పెరగడం గురవయ్య, వేణు, ఈశ్వరయ్య, కుప్పమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
.

Discussion about this post