చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు సమీపంలో అఫోలో పరిశ్రమ ఏర్పాటుకు భూములు కోల్పోయిన భూ భాదితులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రిలే దీక్షలు చేపట్టారు.
పరిశ్రమ ఎదుట దీక్ష చేపట్టాలనుకున్న భూ భాదితులను పోలీసులు అడ్డుకోవడంతో చిన్నపాండూరు వద్ధే భూ బాధితులు శాంతియుత రిలే దీక్షకు దిగారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా సంబంధిత అధికారులు చుట్టూ పరిహారం కోసం తిరిగి తిరిగి అలసిపోయామని, ఇప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
91 మంది బాధితులకు పరిహారం అందించాల్సి ఉందనీ , తక్షణమే ఈ అంశంపై స్పందించి పరిహారం అందించకుంటే అపోలో పరిశ్రమ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరించారు.
బాధితులకు పరిహారం చెల్లించడంలోనూ ,స్థానికులకు ఉపాధి కల్పించడంలోనూ పరిశ్రమ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని మండి పడ్డారు.
ఇకనైనా సంబంధిత అధికారులు భూ బాధితులకు, స్థానికులకు న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
.