చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేంద్రం ఎస్సైగా జీ. పురుషోత్తం రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ ఎస్సైగా పనిచేస్తున్న ప్రతాప్ బదిలీపై నాగలాపురం వెళ్ళగా వరదయ్యపాలెం ఎస్సైగా పనిచేస్తున్న పురుషోత్తం రెడ్డి ఇక్కడికి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజాపోలీస్ గా సేవలందిస్తానని చెప్పారు.
శాంతిభద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ, సీఐ మార్గదర్శనంలో సిబ్బంది సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు.
.

Discussion about this post