క్రియా యూనివర్సిటీ సౌజన్యంతో శ్రీసిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీసిటీ పరిసర 4 ప్రభుత్వ కళాశాలలకు సుమారు 6 లక్షలు విలువచేసే 21 కంప్యూటర్లు వితరణ ఇచ్చారు.
సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 6, వరదయ్యపాళెంకు 6, అరవపాలెంకు 4, తడ ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు 5 కంప్యూటర్లు వంతున శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధులు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందచేశారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా శ్రీసిటీ మరియు పలు పరిశ్రమల చేయూతతో శ్రీసిటీ పరిసర ప్రాంతాల ప్రభుత్వ స్కూళ్లలో విద్యా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు శ్రీసిటీ ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేపడుతోంది.
ఇందులో భాగంగా గతంలోనూ సత్యవేడు, ఇరుగుళం, బత్తలవళ్ళం, మాదనపాలెం ప్రభుత్వ హైస్కూళ్లకు కంప్యూటర్లు వితరణ ఇచ్చారు.
డానీఇలి పరిశ్రమ సహకారంతో ఇరుగళం హైస్కూల్ లో ప్రత్యేకంగా 10 కంప్యూటర్లు, భవనంతో సహా కంప్యూటర్ ల్యాబ్ నిర్మించారు.
కంప్యూటర్లు వితరణ పట్ల కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపక బృందం, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేయడంతో పాటు, క్రియా యూనివర్సిటీ యాజమాన్యానికి, శ్రీసిటీ ఫౌండేషన్ కు కృతఙ్ఞతలు తెలిపారు.
	    	
.
    	
		    
Discussion about this post