శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో శ్రీసిటీలోని ఎంసిఎన్ఎస్ పాలిరిథెన్స్ పరిశ్రమ యాజమాన్యం స్థానిక మత్తేఱిమిట్ట, సిద్ధమఅగ్రహారం ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్న భోజన తయారీ వంట పాత్రలను వితరణ ఇచ్చింది.
23 వేల రూపాయల విలువ చేసే పాత్రలను గురువారం సాయంత్రం ఆయా పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులకు అందచేశారు.
ఈ పాఠశాలల్లో వంట పాత్రలు లేకుండా భోజన తయారీకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రెండు వారాల క్రితం శ్రీసిటీ ఫౌండేషన్ దృష్టికి తెచ్చారు.
దీనిపై వెంటనే స్పందించి ఎంసిఎన్ఎస్ పరిశ్రమ సహకారంతో పాత్రలు సమకూర్చారు.
ఈ కార్యక్రమంలో శ్రీసిటీ సెక్యూరిటీ ఇంచార్జి రమేష్, ఎంసిఎన్ఎస్ పరిశ్రమ హెచ్ఆర్ సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాత్రల వితరణ పట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీసిటీ ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.
	    	
.
    	
		    
Discussion about this post