శ్రీసిటీలోని హెల్తియం మెడ్‌టెక్ పరిశ్రమ రెండు రోజుల క్రితం యూఎస్ ఎఫ్‌డిఎ (ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) రిజిస్ట్రేషన్ పొందింది. హెల్తియం సంస్థ 2012లో శ్రీసిటీ సెజ్ లో తన కార్యకలాపాలను ప్రారంభించింది. 1.20 మిలియన్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో సూచర్స్, మెష్‌లను తయారు చేస్తుంది.
అధిక నాణ్యత, ఖచ్చితత్వ ఆధారిత వైద్య పరికరాల తయారీలో భాగంగా హెల్తియం యొక్క తయారీ ప్లాంట్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ నియంత్రణ సంస్థల కఠినమైన నాణ్యత నియంత్రణ తనిఖీలకు లోబడి పనిచేస్తాయి. శ్రీసిటీలోని ఈ పరిశ్రమ యూఎస్ ఎఫ్‌డిఎ రిజిస్ట్రేషన్ పొందిన హెల్తియం యొక్క 4వ ఉత్పత్తి కేంద్రం.
శ్రీసిటీలోని వెర్మీరెన్ ఇండియా రిహాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమకు ‘కంపెనీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. SAP ఇండియా నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమంలో మెడికల్ ఎక్విప్‌మెంట్ విభాగంలో వెర్మీరెన్ ఈ అవార్డును గెలుచుకుంది. వివిధ పారిశ్రామిక రంగాలలో అత్యుత్తమ వ్యాపార సంస్థలను ఎంపిక చేసి నిర్వాహకులు ఈ అవార్డులను ఇచ్చారు.
ఇది కాకుండా, కరోనా మహమ్మారి సంక్షోభాన్ని తట్టుకుని, వినూత్న పద్ధతులు మరియు డిజిటల్ సాంకేతికతను అవలంబించడం ద్వారా కంపెనీని విజయవంతంగా నడిపించినందుకు గుర్తింపుగా వెర్మీరెన్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ రియాజ్ ఖాద్రీకి ‘డేర్2డ్రీమ్’ అవార్డును అందజేశారు.
పై రెండు ఘటనలపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హెల్త్‌యం మరియు వెర్మీరెన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.
శ్రీసిటీకి చెందిన రెండు సంస్థలు ఉత్తమ నైపుణ్యం, అధిక నాణ్యత గల ఉత్పత్తులకు సాక్ష్యంగా నిలిచే ప్రత్యేకతలను సంపాదించుకోవడం తమకు ఎంతో గర్వకారణం అన్నారు.
.

Discussion about this post