మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న రెండు గంటల్లో దానిని కనిపెట్టి బాధితునికి అప్పగించిన శ్రీసిటీ పోలీసుల పనితీరు ప్రశంసనీయం.
వివరాల్లోకి వెళితే శ్రీసిటీ హెచ్ ఆర్ డి లో పనిచేస్తున్న మోహన్ ఈరోజు ఉదయం బైక్ పై విధులకు వెళుతూ హీరో పరిశ్రమ సమీపంలో తన మొబైల్ ఫోన్ ను పోగొట్టుకున్నాడు. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఫోన్ కనిపించకపోవడంతో శ్రీసిటీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెంటనే స్పందించిన శ్రీసిటీ పోలీసులు టెక్నాలజీ సాయంతో ఫోన్ ను వెదకడం ప్రారంభించారు. హీరో హోండా సమీపంలో ఓ డ్రైవర్ చేతికి ఆ ఫోను దొరికినట్లు గుర్తించడంతో వెంటనే అతని వద్దకు వెళ్లి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఆపై ఫిర్యాదుదారు కు ఫోన్ ని అప్పగించారు. తన 23 వేల రూపాయల విలువైన ‘రియల్ మీ’ ఫోన్ ని రెండు గంటల్లో తనకు అప్పగించిన పోలీసులు పని తీరును ప్రశంసించారు.
డీఎస్పీ జగదీష్ నాయక్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ చిట్టిబాబు, కానిస్టేబుళ్లు రాజశేఖర్, గౌతమ్ ఇతర సిబ్బందికి మోహన్ కృతజ్ఞతలు తెలిపారు.
.

Discussion about this post