ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల క్యాడర్ కు చెందిన 19 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు మంగళవారం శ్రీసిటీని సందర్శించారు.
తమ భారత్ దర్శన్ పర్యటనలో దేశంలోని పలు ముఖ్య ప్రాంతాలతో పాటు ప్రముఖ పారిశ్రామిక నగరం శ్రీసిటీని కూడా ఎంచుకున్నారు. శ్రీసిటీకి వచ్చిన ట్రైనీ ఐఏఎస్ లకు శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) సి.రమేష్ కుమార్ సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ పుట్టుక, ప్రస్థానం, ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. వీరి పర్యటనకు సమన్వయకర్తగా నాయుడుపేట ఆర్దీవో సరోజినీ పాల్గొన్నారు.
ఈ పర్యటనపై శ్రీసిటీ మేనేజింగ్ర డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి స్పందిస్తూ, ట్రైనీ ఐఏఎస్ ల అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తాము గౌరవప్రదంగా భావిస్తున్నామన్నారు.
ట్రైనీ ఐఏఎస్ లే కాకుండా దేశ విదేశాలకు చెందిన అధికారులు, వ్యూహకర్తలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు తమ అధ్యయనానికి శ్రీసిటీని ఎంచుకోవడం తమకు గర్వకారణమన్నారు.
శ్రీసిటీ స్పష్టమైన దృష్టి, మంచి ప్రణాళిక, ఖచ్చితమైన అమలు, ఉపాధి కల్పన, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలను ప్రశంసించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు, దీనికి కృషిచేసిన శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు గురించి తమ పలు సందేహాలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలను చుట్టిచూడడంతో పాటు ఆల్స్టామ్, కొబెల్కో పరిశ్రమలను సందర్శించారు.
	    	
.
    	
		    
Discussion about this post